ETV Bharat / sports

Ravindra Jadeja: టెస్టులకు జడేజా గుడ్‌బై?

Ravindra Jadeja: టీమ్ఇండియా అభిమానులకు నిరాశ. స్టార్ ఆల్​రౌండర్​ రవీంద్ర జడేజా టెస్టులకు గుడ్​బై చెప్పాలని చూస్తున్నాడట. వన్డే, టీ20 ఫార్మాట్లో ఎక్కువ కాలం కెరీర్‌ కొనసాగించడానికి టెస్టులకు వీడ్కోలు పలకాలని 33 ఏళ్ల జడేజా నిర్ణయించుకున్నట్లు అతని సన్నిహితుడు తెలిపాడు.

ravindra jadeja latest news, Jadeja considering Test retirement, జడేజా లేటెస్ట్ న్యూస్, జడేజా టెస్టు రిటైర్మెంట్
ravindra jadeja
author img

By

Published : Dec 15, 2021, 7:12 AM IST

Ravindra Jadeja: టీమ్‌ఇండియాలో పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తొడ కండరాల గాయంతో రోహిత్‌శర్మ దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు దూరమవగా.. వన్డేలకు అందుబాటులో ఉండనని విరాట్‌ కోహ్లీ బీసీసీఐకి సమాచారం ఇచ్చినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా మరో బాంబు పేలింది. ఆల్‌రౌండర్‌ జడేజా టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వన్డేలు, టీ20 ఫార్మాట్లలో ఎక్కువ కాలం కెరీర్‌ కొనసాగించడానికి టెస్టులకు వీడ్కోలు పలకాలని 33 ఏళ్ల జడేజా నిర్ణయించుకున్నట్లు అతని సన్నిహితుడు తెలిపాడు.

గత నెలలో సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో సిరీస్‌లో జడేజా మోచేతికి గాయమైంది. అదే కారణంతో దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు జడేజాను ఎంపిక చేయలేదు. అయితే వీలైనంత త్వరగా జడేజాను టెస్టు క్రికెట్లో చూడాలనుకుంటున్న అభిమానులకు అతని నిర్ణయం నిరాశ కలిగించేదే. మూడు ఫార్మాట్లలోనూ టీమ్‌ఇండియాకు జడేజా తిరుగులేని ఆల్‌రౌండర్‌గా సేవలందిస్తున్నాడు. బౌలింగ్‌, బ్యాటింగ్‌తో రాణిస్తున్న జడేజాకు ఫీల్డింగ్‌లో ఎదురేలేదు. మెరుపు వేగంతో అతను విసిరిన త్రోలు మ్యాచ్‌లను మలుపు తిప్పిన సందర్భాలు ఎన్నో. ఇప్పటి వరకు 57 టెస్టులాడిన జడేజా 2195 పరుగులు చేసి, 232 వికెట్లు తీశాడు. టెస్టు క్రికెట్లో అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన ఎడమచేతి వాటం బౌలర్‌గానూ జడేజా రికార్డు సృష్టించాడు.

ఇవీ చూడండి: Indian Chess League: వచ్చే జూన్‌లో ఇండియన్‌ చెస్‌ లీగ్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.