Ravichandran Ashwin Vs Australia : ప్రపంచ కప్‌నకు ముందు సన్నాహాకాల మ్యాచుల్లో భాగంగా టీమ్ఇండియా స్వదేశంలో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఆస్ట్రేలియాతో పోటీ పడనుంది. సెప్టెంబర్ 22న మొహాలీ వేదికగా జరగనున్న మొదటి వన్డేతో ఈ సిరీస్ షురూ కానుంది. తాజాగా ఈ సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ అనౌన్స్ చేసింది.
అయితే ఈ జట్టులో ఎవరూ ఊహించని విధంగా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు సెలక్టర్లు చోటు కల్పించడం విశేషం. దీంతో అశ్విన్.. దాదాపు 20 నెలల తర్వాత వన్డే టీమ్‌లో చోటు దక్కించుకున్నాడు. అతడు చివరి సారిగా 2022లో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్ బరిలో దిగాడు. అయితే అశ్విన్‌ను జట్టు కోసం ఎంపిక చేయడంపై టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడాడు. ఎందుకు ఎంపిక చేశారో వివరించాడు.
"అశ్విన్ ఎంత అనుభవజ్ఞుడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతడు ఇప్పటికే కెరీర్లో 113 వన్డేలు, 94 టెస్టు మ్యాచులు ఆడాడు. అతడు ఎప్పుడూ మా దృష్టిలోనే ఉంటాడు. అశ్విన్ మాకు మంచి ఎంపిక. గత కొంత కాలంగా వన్డే ఫార్మాట్‌లో లేకపోవచ్చు. కానీ దేశీవాళీ టోర్నీలతో పాటు టెస్టు క్రికెట్‌లో మంచిగా ఆడుతున్నాడు. ఆసీస్ సిరీస్‌కు అశ్విన్‌కు మంచి ఛాన్స్. మరి అతడు ఏ స్థాయిలో ఉన్నాడా అన్నది ఈ సిరీస్‌తో మాకు సమాధానం దొరుకుతుంది" అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.
Ind Vs Aus Odi Series 2023 : ఇకపోతే ఆసీస్‌తో జరగబోయే సిరీస్‌లో మొదటి రెండు వన్డేలకు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్య, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దూరంగా ఉండనున్నారు. వారికి సెలక్టర్లు రెస్ట్ కల్పించారు. మళ్లీ ఈ ముగ్గురు తిరిగి మూడో వన్డేలో ఆడనున్నారు. దీంతో మొదటి రెండు మ్యాచ్‌ల్లో స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ టీమ్ఇండియాకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
Ind Vs Aus Odi Series 2023 Schedule : వన్డే సిరీస్ షెడ్యూల్ ఇలా..
- తొలి వన్డే : సెప్టెంబర్ 22, 2023 శుక్రవారం. పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఐఎస్ బింద్రా స్టేడియం, మొహలి వేదికగా మధ్యాహ్నం 1:30 నుంచి జరగనుందీ మ్యాచ్.
- రెండో వన్డే : సెప్టెంబర్ 24, 2023 ఆదివారం. హోల్కర్ క్రికెట్ స్టేడియం, ఇండోర్ వేదికగా మధ్యాహ్నం 1:30 నుంచి జరగనుందీ మ్యాచ్.
- మూడో వన్డే: సెప్టెంబర్ 27, 2023 బుధవారం. సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, రాజ్‌కోట్ వేదికగా మధ్యాహ్నం 1:30 నుంచి జరగనుందీ మ్యాచ్.
లైవ్ ఎందులో అంటే.. ఈ టీమ్ఇండియా-ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌ను స్పోర్ట్స్ 18 ఇంగ్లీష్‌లో ప్రత్యక్ష ప్రసారం చూడొచ్చు. ఇంకా జియో సినిమాలో మ్యాచ్‌ను ఉచితంగా చూడొచ్చు.
-
🚨 India's squad for the IDFC First Bank three-match ODI series against Australia announced 🚨#TeamIndia | #INDvAUS
— BCCI (@BCCI) September 18, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">🚨 India's squad for the IDFC First Bank three-match ODI series against Australia announced 🚨#TeamIndia | #INDvAUS
— BCCI (@BCCI) September 18, 2023🚨 India's squad for the IDFC First Bank three-match ODI series against Australia announced 🚨#TeamIndia | #INDvAUS
— BCCI (@BCCI) September 18, 2023
Pujara Suspension : వాళ్లు చేసిన పనికి పుజారాపై వేటు.. ఎందుకంటే?