ETV Bharat / sports

'అలా ఆడితే ఎల్బీడబ్ల్యూ ఇవ్వాలి.. వన్డే క్రికెట్ ప్రాధాన్యత చాటుకోవాలి' - అశ్విన్​ న్యూస్

ఎల్బీడబ్ల్యూకి సంబంధించిన రూల్స్‌లో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని టీమ్‌ఇండియా సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అభిప్రాయపడ్డాడు. బ్యాటర్ స్విచ్‌ షాట్‌కు ప్రయత్నించినప్పుడు బంతి మిస్‌ అయి ప్యాట్‌పైకి వెళ్లి వికెట్లను తాకేలా ఉంటే ఎల్బీడబ్ల్యూ ఇవ్వాలని సూచించాడు. వన్డే క్రికెట్‌ తన ప్రాధాన్యతను చాటుకోవాల్సిన అవసరముందన్నాడు.

ravichandran ashwin
ravichandran ashwin
author img

By

Published : Jul 14, 2022, 7:04 AM IST

వన్డే క్రికెట్‌ తన ప్రాధాన్యతను చాటుకోవాల్సిన అవసరముందని టీమ్‌ఇండియా ఆఫ్‌స్పిన్నర్‌ అశ్విన్‌ అన్నాడు. "ప్రాధాన్యత ఎంత ఉందన్నదే ఇప్పుడు ప్రశ్న? వన్డే క్రికెట్‌ తన ప్రాధాన్యతను చాటుకోవాలి" అని చెప్పాడు. "వన్డే క్రికెట్‌ అందం దాని ఎత్తు పల్లాల్లో ఉండేది. జనం సమయం వెచ్చించి ఆటను చూసేవాళ్లు. వన్డే ఫార్మాట్లో ఒకప్పుడు బౌలర్లకూ కీలక పాత్ర ఉండేది" అన్నాడు. ప్రపంచ వ్యాప్తంగా ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లు ఆకర్షణను కోల్పోతున్న నేపథ్యంలో అశ్విన్‌ స్పందించాడు. "వన్డే మ్యాచ్‌ చూస్తున్నప్పుడు ఓ దశ దాటిన తర్వాత నేనే టీవీ ఆపేస్తున్నా. ఫార్మాట్‌కు ఈ పరిణామం ప్రమాదకరం. హెచ్చు తగ్గులు లేకుంటే అది ఎంత మాత్రం క్రికెట్‌ కాదు. అది టీ20 క్రికెట్‌కు పొడిగింపు రూపం మాత్రమే" అని అశ్విన్‌ చెప్పాడు. వన్డే ఇన్నింగ్స్‌లో రెండు కొత్త బంతులు వాడకుండా, పాత పద్ధతిలో ఒకే బంతి వాడాలని అతడు సూచించాడు. వన్డే సిరీస్‌లకు బదులు మరిన్ని టీ20 లీగ్‌లు ఆడడం మంచిదని టీమ్‌ఇండియా మాజీ కోచ్‌ రవిశాస్త్రి లాంటి వారు అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు ఎల్బీడబ్ల్యూకి సంబంధించిన రూల్స్‌లో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని టీమ్‌ఇండియా సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అభిప్రాయపడ్డాడు. బ్యాటర్ స్విచ్‌ షాట్‌కు వెళ్లి బంతి మిస్‌ అయి ప్యాట్‌పైకి వెళ్లి వికెట్లను తాకేలా ఉంటే ఎల్బీడబ్ల్యూ ఇవ్వాలని సూచించాడు. "ఒక బ్యాటర్‌ రివర్స్‌ స్వీప్ లేదా ఇతర షాట్‌ ఆడేడా..? ఎవరైనా బౌలర్‌ నెగిటివ్‌ బౌలింగ్‌ వేశాడా..? దాని గురించి మాట్లాడటం లేదు. నేను కేవలం ఎల్బీడబ్ల్యూ గురించి మాత్రమే అడుగుతున్నా. స్విచ్ షాట్‌కు వెళ్లిన సమయంలో ఎల్బీ నిర్ణయం తీసుకోకపోవడం సరైందిగా అనిపించడం లేదు. వారు స్విచ్‌ షాట్‌కు వెళ్లినప్పుడు ఒకవేళ బంతి మిస్‌ అయి వికెట్లను తాకేలా ఉంటే లెగ్‌సైడ్‌ పడినా సరే మాకు ఎల్బీడబ్ల్యూ ఇవ్వాలి. బ్యాటర్‌ టర్న్‌ అయినంతమాత్రాన ఎల్బీడబ్ల్యూ కాదని మీరెలా చెబుతారు? అన్ని ఫార్మాట్లలో ఔట్‌ ఇస్తేనే బ్యాటింగ్‌, బౌలింగ్‌కు సమ ప్రాధాన్యం ఇచ్చినట్లు అవుతుంది" అని పేర్కొన్నాడు.

భారత్‌తో జరిగిన ఐదో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ భారీ లక్ష్య ఛేదనను చేసి విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో జో రూట్‌, బెయిర్‌స్టో శతకాలు బాదారు. దీనిపైనా అశ్విన్‌ స్పందించాడు. "ఐదో టెస్టు మ్యాచ్‌లో రూట్, బెయిర్‌ స్టో ఆడిన విధానం గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా రూట్‌ పదిసార్లు రివర్స్‌ స్వీప్‌ షాట్లను ప్రయత్నించాడు. అయితే తొమ్మిదిసార్లు విఫలం కాగా.. పదోసారి ఎడ్జ్‌ తీసుకొని వెళ్లిపోయింది. ఇలా ఆడినప్పుడు ఎల్బీగా ఔటయ్యే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే బౌలర్‌ లెగ్‌ సైడ్‌ బౌలింగ్‌ చేసినప్పుడు అటువైపే ఫీల్డింగ్‌ పెడతాడు. కానీ, బ్యాటర్‌ బంతిని రివర్స్‌ స్వీప్‌ షాట్‌ కొట్టేందుకు ప్రయత్నించి మిస్‌ అయినా ఎల్బీడబ్ల్యూ అవకాశం ఉండదు" అని అశ్విన్‌ వివరించాడు.

స్విచ్ షాట్ అంటే ఎలా..?: కుడిచేతి బ్యాటర్‌కు లెగ్‌సైడ్‌ వేసిన బంతిని తిరిగి ఆఫ్‌సైడ్‌ కొడితే దానిని స్విచ్‌ షాట్‌గా పరిగణిస్తారు. వైడ్‌ వెళ్తుందేమోనని అనుకునే ఫీల్డింగ్‌ జట్టుకు దిమ్మతిరిగేలా బ్యాటర్‌ బౌండరీ లాగేస్తుంటాడు. పీటర్సన్‌ ఎక్కువగా ఇలాంటి స్విచ్‌ షాట్లను ఆడేవాడు. ఆ తర్వాత మ్యాక్స్‌వెల్‌, ఏబీడీ కూడా స్విచ్ షాట్లతో పరుగులు దండుకొనేవారు. ఈ షాట్‌ వల్ల బంతి మిస్‌ అయి వికెట్లను తాకేలా ఉన్నా సరే ఎల్బీ అయ్యే అవకాశాలు తక్కువే. ఎందుకంటే బంతి 'అవుట్‌సైడ్ లెగ్‌' పడితే ఎల్బీడబ్ల్యూకి అసలు పరిగణనలోకి తీసుకోరు.

ఇవీ చదవండి:

Icc Rankings: వన్డేల్లో బుమ్రా మళ్లీ నంబర్​ వన్​.. టీ20లో 5వ స్థానానికి సూర్య

బుమ్​ బుమ్​ బుమ్రా... ఇంకా సిక్స్ వికెట్స్​ హీరోస్​ ఎవరెవరంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.