ETV Bharat / sports

'పదేళ్లుగా ఐసీసీ ట్రోఫీ గెలవలేదు.. కారణం అదే'.. రోహిత్​, ద్రవిడ్​​కు అశ్విన్ చురకలు!

WTC Final 2023 Team India : భారత జట్టు పదేళ్లుగా ఐసీసీ ట్రోఫీ గెలవకపోవడానికి అదే కారణమని టీమ్ఇండియా ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్​ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుత కెప్టెన్ రోహిత్​ శర్మ, కోచ్​ రాహుల్​ ద్రవిడ్​​ తీరుపై పరోక్షంగా చురకలంటించాడు.

wtc final 2023 team India
wtc final 2023 team India
author img

By

Published : Jun 23, 2023, 10:52 AM IST

Updated : Jun 23, 2023, 11:42 AM IST

WTC Final 2023 Team India : టీమ్​ఇండియా పదేళ్లుగా ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవలేకపోవడానికి.. ధోనీ స్టైల్​ను ఫాలో కాకపోవడమే కారణమని కూడా భారత జట్టు ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అభిమానుల బాధ తనకు అర్థమవుతోందని.. అయితే ప్లేయర్స్​ను తరచూ జట్టులో ఉంచడం, తీసేయడం వల్ల ట్రోఫీలు గెలవడం సాధ్యం కాదని ​తేల్చి చెప్పాడు. ​ఈ సందర్భంగానే ధోనీ గురించి ప్రస్తావిస్తూ.. ప్రస్తుతం కెప్టెన్​ రోహిత్ శర్మ, కోచ్​ రాహుల్ దరావిడ్​కు తీరుపై చురకలంటించాడు. యాషెస్ మొదటి టెస్ట్ గెలిచిన ఆస్ట్రేలియాను అభినందిస్తూ.. తన యూట్యూబ్​ షోలో మాట్లాడిని అశ్విన్​.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిఫ్​ (డబ్ల్యూటీసీ) ఫైనల్​ ఓటమిని మరోసారి గుర్తు చేసుకుంటూ ఈ మేరకు​ వ్యాఖ్యానించాడు.

ICC Trophies Won By Dhoni : పదేళ్లుగా టీమ్ఇండియా ఐసీసీ ట్రోఫీ గెలవలేకపోయింది. దీంతో ధోనీపై సోషల్​ మీడియాలో పోస్టులు పెట్టారు అభిమానులు. దీనిపై స్పందించిన అశ్విన్​.. ప్లేయర్లకు భద్రత కల్పించడమే ధోనీ విజయానికి కారణం అని అన్నాడు. "పదేళ్లుగా టీమ్​ఇండియా ఐసీసీ ట్రోఫీ గెలవలేకపోయింది. ఫ్యాన్స్​ బాధ ఏంటో నాకు తెలుసు. అయితే వారు ఓ ప్లేయర్​ను తీసేయాలని, మరో ప్లేయర్​ను జట్టులోకి తీసుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కానీ ఒక ప్లేయర్ క్వాలిటీ రాత్రికి రాత్రే మారిపోదు. మనం ధోనీ నాయకత్వం గురించి మాట్లాడుకుంటాం. అతడు ఏం చేశాడు? అది చాలా సింపుల్. అతడి సారథ్యంలో నేను ఆడినప్పుడు జట్టులో ఓ 15 మందిని తీసుకునేవాడు. ఆ 15 మంది తుది జట్టే.. ఆ ఏడాది మొత్తం ఆడేది. ఓ ప్లేయర్​కు అలాంటి భద్రత అనేది చాలా ముఖ్యం" అని అశ్విన్​ కుండబద్దలుగొట్టాడు.

అయితే, ఏదైనా విషయాన్ని నిక్కచ్చిగా చెప్పే అశ్విన్​.. ప్లేయర్ల అభద్రతాభావం గురించి గడిచిన రెండు వారాల్లో రెండోసారి మాట్లాడాడు. "నేను ఎక్కువగా ఆలోచిస్తానని చాలా మంది నాపై ఓ ముద్ర వేశారు. ఓ ప్లేయర్ వరుసగా 15-20 మ్యాచ్​లు ఆడినప్పుడు అతడు మానసికంగా అంతలా ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ రెండు, మ్యాచ్​లు మాత్రమే ఆడే ప్లేయర్ బాధపడటం, అతిగా ఆలోచించడం సహజంగా జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా వచ్చి నువ్వు 15 మ్యాచ్​లు వరసగా ఆడతావు.. నీ బాధ్యత ఇది.. నీకు కెప్టెన్సీ ఇస్తాము అంటే నేను అతిగా ఆలోచించను. అంతే కదా?" అని అశ్విన్ స్పష్టం చేశాడు.

Last Updated : Jun 23, 2023, 11:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.