ETV Bharat / sports

అశ్విన్​ విజ్ఞప్తితో అజాజ్ ట్విట్టర్​ ఖాతాకు బ్లూటిక్ - అజాజ్ పటేల్ రవి అశ్విన్

Ajaz Patel Twitter Account: న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ ఒక్క ఇన్నింగ్స్​లో 10 వికెట్లు సాధించడంపై ప్రశంసల జల్లు కురిపించాడు టీమ్ఇండియా స్పిన్నర్ అశ్విన్. అలాగే ఇంతటి ఘనత సాధించిన అజాజ్ ట్విట్టర్ ఖాతాను వెరిఫై చేయాల్సిందిగా యాజమాన్యాన్ని కోరాడు. ఈ విజ్ఞప్తిని పరిశీలించిన ట్విట్టర్ అజాజ్ ఖాతాకు బ్లూ టిక్ ఇచ్చింది.

Ajaz patel ravi ashwin, Ajaz patel ravi ashwin latest news, అజాజ్ పటేల్ ట్విట్టర్ ఖాతా, అశ్విన్, అజాజ్
Ajaz patel
author img

By

Published : Dec 7, 2021, 1:02 PM IST

Updated : Dec 7, 2021, 1:36 PM IST

Ajaz Patel Twitter Account: న్యూజిలాండ్​తో జరిగిన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్​లో భారత్​ను గట్టి దెబ్బ తీశాడు కివీస్ స్పిన్నర్ అజాజ్ పటేల్. ఏకంగా పది వికెట్లు తీసి ఈ ఘనత సాధించిన మూడో బౌలర్​గా రికార్డు సాధించాడు. అయినా ఈ మ్యాచ్​లో టీమ్ఇండియా ఘనవిజయం సాధించింది. అనంతరం అజాజ్​ ఘనతపై ప్రశంసల జల్లు కురిపించాడు టీమ్ఇండియా స్పిన్నర్ అశ్విన్. బౌలర్లందరూ కలలు కలే ఘనత సాధించాడని కొనియాడాడు. అలాగే ట్విట్టర్​లో అజాజ్​ ఖాతా వెరిఫైడ్​ కాలేదని తెలుసుకుని.. ఆ సంస్థ యాజమాన్యానికి విజ్ఞప్తి చేశాడు.

"డియర్ ట్విట్టర్ వెరిఫైడ్. ఇన్నింగ్స్​లో 10 వికెట్ల ఘనత సాధించిన అజాజ్ ఖాతా వెరిఫై కావాల్సిన అవసరం ఉంది" అంటూ వారికి ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ చేసిన కొన్ని గంటల్లోనే అజాజ్ ఖాతా వెరిఫైడ్ అయినట్లు తెలిసింది. ట్విట్టర్ అజాజ్ ఖాతాకు బ్లూ టిక్ ఇచ్చింది. దీనిపై స్పందించిన అశ్విన్.. ట్విట్టర్​కు కృతజ్ఞతలు తెలిపాడు.

  • Dear @verified , a ten wicket bag in an innings definitely deserves to be verified here! 😂 @AjazP

    — Ashwin 🇮🇳 (@ashwinravi99) December 6, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఈ మ్యాచ్‌లో కివీస్‌ స్పిన్నర్‌ అజాజ్‌ 225 పరుగులిచ్చి 14 వికెట్లు పడగొట్టాడు. ఇక ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. కాగా, ఓ టెస్టు మ్యాచ్‌లో భారత్‌పై అత్యుత్తమ ప్రదర్శన చేసిన బౌలర్‌గానూ అతడు నిలిచాడు. కివీస్‌ తరపున టెస్టుల్లో అతడికిది రెండో అత్యుత్తమ ప్రదర్శన. రిచర్డ్‌ హ్యాడ్లీ (1985లో ఆస్ట్రేలియాపై 15/123) అగ్రస్థానంలో ఉన్నాడు.

ఇవీ చూడండి: వాంఖడే క్యూరేటర్​కు టీమ్ఇండియా నగదు ప్రోత్సాహం

Last Updated : Dec 7, 2021, 1:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.