ETV Bharat / sports

ICC Test Rankings: మెరుగైన శ్రేయస్, గిల్.. టాప్​-5లో జడేజా, అశ్విన్ - ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ బుమ్రా

ICC Test Rankings: ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్​ బ్యాటింగ్ విభాగంలో ఐదు, ఆరు స్థానాలను కాపాడుకున్నారు టీమ్ఇండియా క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ. అలాగే బౌలర్ల విభాగంలో ఒక స్థానం కోల్పోయి 10వ ర్యాంకుకు చేరాడు బుమ్రా. ఆల్​రౌండర్ల విభాగంలో జడేజా, అశ్విన్ టాప్-5లో నిలిచారు.

ICC Test Rankings latest, Ashwin jadeja latest news, అశ్విన్ జడేజా టెస్టు ర్యాంకింగ్స్, లేటెస్ట్ టెస్టు ర్యాంకింగ్స్
ICC Test Rankings
author img

By

Published : Dec 1, 2021, 3:23 PM IST

ICC Test Rankings: టెస్టు​ ర్యాంకింగ్స్​ను తాజాగా విడుదల చేసింది ఐసీసీ. టీమ్​ఇండియా స్టార్ ఓపెనర్​ రోహిత్ శర్మ(805 పాయింట్లు), కెప్టెన్​ కోహ్లీ(775 పాయింట్లు) ఐదు, ఆరు స్థానాల్లోనే కొనసాగుతున్నారు. ఇంగ్లాండ్​ కెప్టెన్​ జో రూట్​(903) తన అగ్రస్థానాన్ని కాపాడుకున్నాడు. ఇక న్యూజిలాండ్​తో జరిగిన తొలి టెస్టులో సెంచరీతో మెరిసిన శ్రేయస్​ అయ్యర్(105) ​ 74వ ర్యాంకుకు, ఓపెనర్​ శుభమన్​ గిల్​ 66వ ర్యాంకుకు, వృద్ధిమాన్​ సాహా 99వ స్థానానికి చేరుకున్నారు.

బౌలింగ్​ విభాగంలో పాకిస్థాన్​ ఫాస్ట్​ బౌలర్​ షాహీన్​ షా అఫ్రిది తొలిసారి కెరీర్​లో టాప్​-5లో చోటు దక్కించుకున్నాడు. బంగ్లాదేశ్​తో జరిగిన తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్​లో కలిపి ఏడు వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్​లో ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. ఈ మ్యాచ్​లో పాక్​ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంలో కీలకంగా వ్యవహరించి తన అద్భుత ప్రదర్శనతో మూడు ర్యాంకులు ముందుకు జరిగి ఐదో స్థానానికి చేరుకున్నాడు. పాక్​ జట్టులోని హాసన్​ అలీ కూడా కెరీర్​ బెస్ట్​ ర్యాంకును అందుకున్నాడు. ఐదు స్థానాలు ఎగబాకి 11వ ర్యాంకులో నిలిచాడు. టీమ్​ఇండియాలో రవిచంద్రన్​ అశ్విన్​ రెండో స్థానంలోని నిలవగా.. బుమ్రా ఒక స్థానం కిందకు జరిగి పదో ర్యాంకులో ఉన్నాడు. ఆల్​రౌండర్స్ విభాగంలో జడేజా రెండు, అశ్విన్ మూడో ర్యాంకులో నిలిచారు..

ఇవీ చూడండి: IPL 2022: మెగా వేలంలో ఈ స్టార్ క్రికెటర్లు ఎన్ని రూ.కోట్లు పలుకుతారో?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.