యూఏఈ వేదికగా అక్టోబర్ 17 నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ కోసం జట్టును ప్రకటించింది అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు(Afghanistan Cricket News). ఆ దేశ టీ20 జట్టుకు స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ను సారథిగా నియమిస్తూ ఏసీబీ, సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది.
ఈ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు రషీద్ ఖాన్(Rashid Khan news). కనీసం తన అభిప్రాయం ఏంటని అడగకుండానే సెలక్షన్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుందని అన్నాడు. ఈ నేపథ్యంలో జట్టు సారథ్య బాధ్యతల నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటిస్తూ ట్వీట్ చేశాడు.
-
🙏🇦🇫 pic.twitter.com/zd9qz8Jiu0
— Rashid Khan (@rashidkhan_19) September 9, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">🙏🇦🇫 pic.twitter.com/zd9qz8Jiu0
— Rashid Khan (@rashidkhan_19) September 9, 2021🙏🇦🇫 pic.twitter.com/zd9qz8Jiu0
— Rashid Khan (@rashidkhan_19) September 9, 2021
"కెప్టెన్గా, అఫ్గాన్ జాతీయ పౌరుడిగా సెలక్షన్ కమిటీ సమావేశంలో పాల్గొనే హక్కు నాకుంది. కానీ, సెలక్షన్ కమిటీ, అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు నా అభిప్రాయం తెలుసుకోకుండానే కెప్టెన్ బాధ్యతలు అప్పగించింది. అందుకే.. టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకొంటున్నా. దేశం తరఫున ఆడేందుకు ఎల్లప్పుడూ గర్వపడతా."
-రషీద్ ఖాన్, అఫ్గాన్ క్రికెటర్.
సెలక్షన్ కమిటీ జట్టును ప్రకటించిన కొద్ది సేపటికే రషీద్(Rashid Khan Captain) కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం అభిమానులకు నిరాశను మిగిల్చింది.
నయా కెప్టెన్..
రషీద్ వైదొలిగిన నేపథ్యంలో.. ఆల్రౌండర్ మహమ్మద్ నబీని(Mohammad Nabi Captain) కెప్టెన్గా నియమిస్తున్నట్లు అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు తెలిపింది. ఈ నిర్ణయాన్ని స్వాగతించాడు నబీ.
"పరిస్థితులు క్లిష్టంగా ఉన్నందున.. అఫ్గాన్ క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా. టీ20 ప్రపంచకప్లో జట్టు బాగా రాణిస్తుందని ఆశిస్తున్నా" అని నబీ ట్వీట్ చేశాడు
ఇదీ చదవండి:Rashid Khan: 'మళ్లీ ఆ బాధ్యతలు వద్దు'