ETV Bharat / sports

క్రికెట్​ అసోసియేషన్​ ప్రెసిడెంట్​పై అత్యాచార ఆరోపణలు! - అత్యాచార యత్నం ఆరోపణలు

Rape attempt: తనపై బీహార్​ క్రికెట్​ అసోసియేషన్​ ప్రెసిడెంట్​ రాకేష్​ తివారీ అత్యాచారయత్నానికి పాల్పడ్డారంటూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దిల్లీలోని ఓ 5 స్టార్​ హోటల్​లో బలవంతంగా అత్యాచారం చేయడానికి ప్రయత్నించారని, తాను తప్పించుకుని పారిపోయినట్లు బాధితురాలు తెలిపారు.

అత్యాచార యత్నం
rape attempt
author img

By

Published : Mar 9, 2022, 4:11 PM IST

Rape attempt: బీహార్​ క్రికెట్​ అసోసియేషన్​ ప్రెసిడెంట్​ రాకేష్​ తివారీ తనపై అత్యచార యత్నానికి పాల్పడ్డారంటూ ఓ ప్రైవేటు కంపెనీలో డైరెక్టర్​గా విధిలు నిర్వహిస్తున్న మహిళ పోలీసులను ఆశ్రయించారు. తమకు రావలసిన డబ్బుల కోసం దిల్లీలోని ఓ 5 స్టార్​ హోటల్​కు వెళ్తే.. అక్కడ బలవంతంగా అత్యాచారానికి యత్నించారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు దిల్లీ డీసీపీ అమ్రిత గుగులౌత్​ ఎఫ్ఐఆర్​ నమోదు చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం..

బాధితురాలు ఒక ప్రైవేటు ఈవెంట్​ ఆర్గనైజింగ్​ కంపెనీ డైరక్టర్​గా బాధ్యతలు వహిస్తున్నారు. ఆ కంపెనీ స్పోర్ట్స్​ మేనేజ్​మెంట్​, ఈవెంట్​ ఆర్గనైజేషన్స్​ వంటివి కార్యక్రమాలు చేస్తుంటారు. గతేడాది బీహర్​ క్రికెట్​ అసోసియేషన్​ టీ20 లీగ్​లను నిర్వహించింది. ఆ లీగ్​కు సంబంధించిన ప్రకటనల కాంట్రాక్ట్​ను బాధితురాల కంపెనీకి అప్పజెప్పారు.

లీగ్​ పూర్తయినా డబ్బుల చెల్లింపులు జరగలేదు. అయితే గతేడాది జులైలో బాధితురాలు డబ్బులు కోసం రాకేష్​ తివారీని కలవడానికి దిల్లీలోని ఓ 5 స్టార్​ హోటల్​కు వెళ్లింది. డబ్బుల కోసం వారిద్దరి మధ్య చర్చలు జరిగాయి. అక్కడ బలవంతంగా అత్యాచారం చేయబోయారని, తాను తప్పించుకుని పారిపోయానని బాధితురాలు తెలిపింది.

ఇదీ చదవండి: క్రికెట్​లో కొత్త రూల్స్​.. ఇకపై మన్కడింగ్​ నిషేధం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.