Ranjji Trophy 2022: రంజీ ట్రోఫీని రెండు దశల్లో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు గురువారం బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ చెప్పారు. ఆ మాటలను నిజం చేస్తూ.. శుక్రవారం బీసీసీఐ సెక్రటరీ జైషా రంజీ టోర్నీపై ప్రకటన చేశారు. వచ్చేనెల మొదటి వారం నుంచి మొదటి ఫేజ్‌ను నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. రెండో ఫేజ్‌ను జూన్‌లో జరపనున్నట్లు తెలిపారు.
గత ఏడాది జరగాల్సిన మ్యాచ్‌లను కరోనా కారణంగా రద్దు చేశారు. ఈ ఏడాది రంజీ టోర్నీని జనవరి 13 నుంచి నిర్వహించాలని భావించారు. కానీ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో దేశవాళీ టోర్నీలు వాయిదా వేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. మళ్లీ రెండు దఫాలుగా నిర్వహించాలనే ప్రతిపాదనతో నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. అయితే మార్చి 27 నుంచి ఐపీఎల్ మ్యాచ్‌లు జరగనున్నాయి.
రంజీ ట్రోఫీ క్రికెట్‌కు వెన్నెముక..
రంజీ ట్రోఫీలు భారత క్రికెట్‌కు కీలకమైనదని అన్నారు టీమ్ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి. ఈ దేశవాళీ ఆటలను విస్మరిస్తే క్రికెట్‌కు వెన్నెముక లేకుండా పోతుందని చెప్పాడు. మార్చి 27 నుంచి ఐపీఎల్ నిర్వహించనున్న నేపథ్యంలో రంజీ ట్రోఫీ జరపడం కష్టమనే అభిప్రాయాలు వెలువడగా.. రవిశాస్త్రి ఈ మేరకు ట్వీట్ చేశాడు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి: BCCI on Ranji Trophy: 'రెండు దశల్లో రంజీ ట్రోఫీ నిర్వహణ'