Ranji Trophy: దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీకి ముందు పలువురు ఆటగాళ్లు, సహాయ సిబ్బందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో ఈ టోర్నీని వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.
తొలుత ఈ విషయంపై స్పందించిన బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ.. టోర్నీ యథావిధిగా జరుగుతుందని స్పష్టం చేశారు. మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా షెడ్యూల్ ప్రకారమే టోర్నీ నిర్వహిస్తామని వెల్లడించారు. కానీ, కొవిడ్ ప్రభావంతో ఈ టోర్నీని వాయిదా వేయక తప్పలేదు. ఈనెల 13న ప్రారంభం కావాల్సిన రంజీ ట్రోఫీ ఎప్పుడు షురూ కానుందనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.
ఇదీ చదవండి: