Raina Shivam Dube: అఫ్గానిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ శివమ్ దూబే ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. తొలుత బంతితో (1/9) రాణించిన దూబే, ఛేజింగ్‌లో అజేయమైన హాఫ్ సెంచరీ (60)తో జట్టును గెలిపించి 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్నాడు. అయితే మ్యాచ్ అనంతరం మాజీ క్రికెటర్ సురేశ్ రైనా, దూబే మధ్య ఓ ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది.
దూబే ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. చెన్నై కెప్టెన్ ధోనీ 2023 ఐపీఎల్ సీజన్లో దూబేను కేవలం బ్యాటింగ్ ఆర్డర్‌లోనే దించాడు. అతడికి బౌలింగ్ చేసే ఛాన్స్ ఇవ్వలేదు. అయితే అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్‌లో దూబే బౌలింగ్ చూసిన తర్వాత అతడి గురించి ధోనీ తన అభిప్రాయాన్ని మార్చుకోవాలని రైనా అన్నాడు.' ఇవాళ మహీ భాయ్ నీ బౌలింగ్ చూస్తే, 2024 ఐపీఎల్ సీజన్లో చెన్నై తరఫున ప్రతీ మ్యాచ్‌లో 3 ఓవర్లు పక్కా బౌలింగ్ చేయిస్తాడు' అని రైనా నవ్వతూ అన్నాడు. దీనికి వెంటనే 'ధోనీ భాయ్, రైనా అన్నా మాట వినండి' అని దూబే నవ్వుతూ అన్నాడు.
-
Suresh Raina - If Mahi bhai saw your bowling tonight then your 3 overs are fixed for CSK this season (laughs).
— 𝙎𝙖𝙪𝙧𝙖𝙗𝙝𝙫𝙠𝙛18❤️🔥 (@Saurabhvkf18) January 12, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
Dube - Mahi bhai please listen to Raina bhai (smiles). pic.twitter.com/FYlvIjdiIz
">Suresh Raina - If Mahi bhai saw your bowling tonight then your 3 overs are fixed for CSK this season (laughs).
— 𝙎𝙖𝙪𝙧𝙖𝙗𝙝𝙫𝙠𝙛18❤️🔥 (@Saurabhvkf18) January 12, 2024
Dube - Mahi bhai please listen to Raina bhai (smiles). pic.twitter.com/FYlvIjdiIzSuresh Raina - If Mahi bhai saw your bowling tonight then your 3 overs are fixed for CSK this season (laughs).
— 𝙎𝙖𝙪𝙧𝙖𝙗𝙝𝙫𝙠𝙛18❤️🔥 (@Saurabhvkf18) January 12, 2024
Dube - Mahi bhai please listen to Raina bhai (smiles). pic.twitter.com/FYlvIjdiIz
ధోనీయే నా కాన్ఫిడెన్స్: మ్యాచ్ ముగించడం ఎలాగో ధోనీ నుంచి నేర్చుకున్నానని దూబే అన్నాడు. మ్యాచ్ తర్వాత రైనా, ప్రజ్ఞాన్ ఓజాతో దూబే ముచ్చటించాడు. 'నేను మహీ భాయ్ నుంచి ఎంతో నేర్చుకున్నా. ఆయన డెత్ ఓవర్లలో ఎలా ఆడాలో నేర్పించారు. నా బ్యాటింగ్‌కు రేంటింగ్ కూడా ఇస్తారు. దాని వల్ల నేను ఇంకా బాగా ఆడేందుకు ప్రయత్నిస్తా. అది నా కాన్ఫిడెన్స్‌ను పెంచుతుంది. ఇక బౌలింగ్‌పై కూడా శ్రద్ధ పెట్టాను. చాలా రోజుల నుంచి బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నా. అవకాశాలు అంత సింపుల్‌గా రావు. నేనూ చాలా కాలం వెయిట్ చేశా. నాకు ఈరోజు ఛాన్స్ వచ్చింది' అని దూబే అన్నాడు.
-
Acing the chase 😎
— BCCI (@BCCI) January 12, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
Conversations with Captain @ImRo45 👌
Message for a special bunch 🤗
Hear from the all-rounder & Player of the Match of the #INDvAFG T20I opener - @IamShivamDube 👌👌 - By @ameyatilak
WATCH 🎥🔽 #TeamIndia | @IDFCFIRSTBank pic.twitter.com/edEH8H3O5f
">Acing the chase 😎
— BCCI (@BCCI) January 12, 2024
Conversations with Captain @ImRo45 👌
Message for a special bunch 🤗
Hear from the all-rounder & Player of the Match of the #INDvAFG T20I opener - @IamShivamDube 👌👌 - By @ameyatilak
WATCH 🎥🔽 #TeamIndia | @IDFCFIRSTBank pic.twitter.com/edEH8H3O5fAcing the chase 😎
— BCCI (@BCCI) January 12, 2024
Conversations with Captain @ImRo45 👌
Message for a special bunch 🤗
Hear from the all-rounder & Player of the Match of the #INDvAFG T20I opener - @IamShivamDube 👌👌 - By @ameyatilak
WATCH 🎥🔽 #TeamIndia | @IDFCFIRSTBank pic.twitter.com/edEH8H3O5f
వాళ్లిద్దరూ చాలా ముఖ్యం: 2024 టీ20 వరల్డ్‌కప్‌లో టీమ్ఇండియాకు సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ చాలా ముఖ్యం అని రైనా అభిప్రాయపడ్డాడు. సౌతాఫ్రికా పిచ్‌లపై ఆడాలంటే రోహిత్, విరాట్ అనుభవం జట్టుకు ఎంతో ఉపయోగపడుతుందని రైనా అన్నాడు.