ETV Bharat / sports

స్టార్​ ఓపెనర్​ సర్జరీ సక్సెస్​.. త్వరలోనే టీమ్​ ఇండియాలోకి రీ ఎంట్రీ! - టీమ్​ఇండియా కెప్టెన్​

టీమ్​ ఇండియా సీనియర్​ ఓపెనర్​, వైస్​ కెప్టెన్ కేఎల్​ రాహుల్​.. సర్జరీ విజయవంతం అయింది. ప్రస్తుతం జర్మనీలో ఉన్న ఈ స్టార్​ క్రికెటర్​.. త్వరలోనే భారత జట్టులోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ప్రస్తుతం.. ఓ టెస్టు, వన్డే, టీ20 సిరీస్ కోసం ఇంగ్లాండ్​లో పర్యటిస్తోంది భారత్​. ​

Rahul undergoes successful surgery in Germany

author img

By

Published : Jun 30, 2022, 3:41 PM IST

KL Rahul Surgery: టీమ్‌ ఇండియా కీలక ఆటగాడు కేఎల్‌ రాహుల్ త్వరలోనే తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నాడు. గాయం కారణంగా జట్టుకు దూరమైన కేఎల్‌.. జర్మనీలో చికిత్స పొందుతున్నాడు. తాజాగా ట్విట్టర్​ ద్వారా రాహుల్‌ తన ఆరోగ్యానికి సంబంధించిన అప్‌డేట్‌ ఇచ్చాడు. 'గాయం కారణంగా కొన్ని వారాల నుంచి కఠిన పరిస్థితులను ఎదుర్కొన్నాను. ఇప్పుడు నా సర్జరీ పూర్తయింది. నెమ్మదిగా కోలుకుంటున్నాను. నా ఆరోగ్యం బాగుండాలని ప్రార్థించిన అభిమానులందరికీ ధన్యవాదాలు. త్వరలోనే కలుస్తా' అని రాహుల్‌ ట్వీట్‌ చేశాడు.

Rahul undergoes successful surgery in Germany
కేఎల్​ రాహుల్​ ట్వీట్​

రోహిత్‌ గైర్హాజరీలో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు కెప్టెన్‌గా ఎంపికైన రాహుల్‌.. తొలి టీ20కి ముందు ప్రాక్టీస్‌ సెషన్‌లో గాయపడ్డాడు. దీంతో ఆ సిరీస్‌కు దూరమయ్యాడు. అయితే ఇంగ్లాండ్‌తో కీలక టెస్టు మ్యాచ్‌కు కేఎల్‌ అందుబాటులో ఉంటాడని అంతా భావించారు. అయితే రాహుల్ ఆరోగ్యాన్ని పర్యవేక్షించిన బీసీసీఐ వైద్య బృందం.. అతడు మెరుగైన చికిత్స కోసం జర్మనీ వెళ్లాల్సి ఉంటుందని తెలిపింది. దీంతో ఇంగ్లాండ్ పర్యటనకు కేఎల్ రాహుల్ దూరమైనట్లు బీసీసీఐ సెక్రటరీ జై షా అధికారికంగా ప్రకటించారు. గ‌జ్జ‌ల్లో గాయం తీవ్ర‌త పెర‌గ‌డంతో చికిత్స కోసం కేఎల్ రాహుల్ జ‌ర్మ‌నీ వెల్ల‌బోతున్న‌ట్లు వెల్ల‌డించారు.

ఈ నేపథ్యంలో రాహుల్‌కు జర్మనీలో స్పోర్ట్స్‌ హెర్నియా సర్జరీ జరిగినట్లు తెలుస్తోంది. మరో వారంలో అతడు బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీకి చేరుకుని శిక్షణ తీసుకుంటాడని సమాచారం. జులైలో జరిగే ఇంగ్లాండ్‌, వెస్టిండీస్‌ సిరీస్‌లకు అతడు అందుబాటులో ఉండడు. అయితే ఆగష్టులో జరిగే ఆసియాకప్‌ నాటికి టీమ్‌ ఇండియాలో చేరే అవకాశం ఉంది.

ఇవీ చూడండి: IND VS ENG: కథ మారింది.. ఎవరెలా ఆడతారో?

కోహ్లీ ఫామ్​లో లేకపోవడానికి కారణం అది కాదు: ద్రవిడ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.