ETV Bharat / sports

ICC T20 Rankings: కేఎల్ రాహుల్ ఓ స్థానంపైకి​.. కోహ్లీ, రోహిత్​? - ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్

ICC T20 Rankings: టీమ్​ఇండియా బ్యాటర్​ కేఎల్​ రాహుల్​ ఐసీసీ విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్​లో నాలుగో స్థానంలో నిలిచాడు. ఆల్​రౌండర్ల విభాగంలో భారత్​కు నిరాశే మిగిలింది. మరోవైపు వెస్టిండీస్​ ఆటగాళ్లు అకియల్​ హోసేన్​, హోల్డర్లు తమ కెరీర్​ బెస్ట్​ ర్యాంకింగ్స్​ను సాధించారు.

icc t20 rankings
టీ20 ర్యాంకింగ్స్​
author img

By

Published : Feb 2, 2022, 4:28 PM IST

ICC T20 Rankings: ఐసీసీ తాజా టీ20 ర్యాంకింగ్స్​ను(ICC Ranking T20) బుధవారం విడుదల చేసింది. బ్యాటింగ్​ విభాగంలో ఓపెనర్​ కేఎల్​ రాహుల్​ ఒక స్థానం మెరుగుపరచుకుని నాలుగో స్థానానికి చేరుకున్నాడు. విరాట్​ కోహ్లీ 10వ స్థానం, వన్డే-టీ20 కెప్టెన్​ రోహిత్​ శర్మ 11వ స్థానాల్లో కొనసాగుతున్నారు.

బౌలింగ్ విభాగంలో టాప్​-10​లో టీమ్​ఇండియా బౌలర్లకు స్థానం దక్కలేదు. భువనేశ్వర్​ కుమార్​ 20వ స్థానంలో.. బూమ్రా 26వ స్థానంలో నిలిచారు. ఆల్​రౌండర్ల జాబితాలో భారత్​కు నిరాశే మిగిలింది. టీమ్​ఇండియా ఆటగాడు ఎవరికీ ఈ జాబితాలో చోటు దక్కలేదు.

కెరీర్​ బెస్ట్​ ర్యాంకింగ్స్​ వీరివే..

విండీస్​ ఆటగాళ్లు అకియల్​ హోసేన్​, ఫాస్ట్​ బౌలర్​ జేసన్​ హోల్డర్లు బౌలింగ్​ విభాగంలో తమ కెరీర్​ బెస్ట్​ ర్యాంకింగ్స్​ను సాధించారు. ఇటీవల ఇంగ్లాండ్​తో టీ20 సిరీస్​లోని ఆఖరి మ్యాచ్​లో జట్టుకు విజయం అందించడంలో కీలక పాత్ర పోషించారు. హోసేన్​ 15 స్థానాలు ఎగబాకి 18వ స్థానానికి చేరుకోగా.. మూడు స్థానాలు మెరుగుపరచుకుని 23వ స్థానంలో నిలిచాడు హోల్డర్​.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి : అతడిచ్చిన సలహాల వల్లే మెరుగ్గా రాణిస్తున్నా: చాహల్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.