2018 అండర్-19 ప్రపంచకప్ సందర్భంగా కోచ్ ద్రవిడ్‌తో జరిగిన ఓ సంఘటనను గుర్తు చేసుకున్నాడు టీమ్ఇండియా యువ ఓపెనర్ పృథ్వీ షా. ద్రవిడ్‌తో కలిసి తాము డిన్నర్ చేయాలంటే.. కొంచెం భయంగా ఉండేదని వెల్లడించాడు.
"ద్రవిడ్ సర్ మాతో చాలా సన్నిహితంగా ఉండేవారు. మైదానం వెలుపల కూడా మాతో ఫ్రెండ్లీగా ఉంటారు. మాతో కలిసి డిన్నర్ కూడా చేస్తారు. అయినప్పటికీ ఆయనంటే కొంచెం భయంగా ఉంటుంది. ఆయన లాంటి దిగ్గజ క్రికెటర్ పక్కన కూర్చోవాలనే ప్రతి యువ ఆటగాడి కల ఆయన వల్ల సాకారమైంది. ఆయనెప్పుడు తనలా ఆడాలని బలవంతంగా చెప్పరు. ఎవరి సహజ శైలిలో వారు ఆడాలని కోరుకుంటారు"
-పృథ్వీ షా, టీమ్ఇండియా యువ ఓపెనర్.
ఇదీ చదవండి: రైల్వే శాఖ విధుల నుంచి సుశీల్ సస్పెండ్
"ఆటను ఆస్వాదించమని ద్రవిడ్ సర్ చెప్పేవారు. చేసిన తప్పులు పదే పదే చేస్తే తప్ప వారించేవారు కాదు. ఆయన ఎక్కువగా మానసిక అంశాలు, ఆటకు సంబంధించిన అంశాల గురించి మాత్రమే చర్చించేవారు" అని పృథ్వీ షా వెల్లడించాడు.
అండర్-19తో పాటు ఇండియా-ఏ జట్లకు కోచ్‌గా వ్యవహరిస్తున్న ద్రవిడ్‌ను త్వరలో శ్రీలంకతో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌లకు కోచ్‌గా ఎంపిక చేసింది బీసీసీఐ. అదే సమయంలో ఇంగ్లాండ్‌లో డబ్ల్యూటీసీ ఫైనల్‌తో పాటు రూట్ సేనతో టెస్టు సిరీస్ ఉంది. సీనియర్ల జట్టుతో పాటే కోచ్ రవిశాస్త్రి వెళ్లనున్నాడు. దీంతో లంక టూర్ కోసం ద్రవిడ్‌కు కోచ్‌గా అవకాశం కల్పించారు.
ఇదీ చదవండి: సుశీల్.. రాత్రంతా కన్నీరు- భోజనానికి నిరాకరణ