Rahul Dravid: క్రికెట్‌లో టీమ్ ఇండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు జెంటిల్మెన్‌గా పేరుంది. ఆయన మాటతీరు, ప్రవర్తన హుందాగా ఉంటాయి. ఈ విషయాన్ని మరోసారి నిరూపించుకొన్నాడు. పాక్‌తో మ్యాచ్‌కు ముందు నిర్వహించే ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో ఓ సరదా ఘటన జరిగింది. ఓ పదం నోటిదాకా వచ్చినా.. పలక్కుండా ద్రవిడ్ నియంత్రించుకొని విలేకర్లకు సమాధానం ఇచ్చాడు.
శనివారం సాయంత్రం ద్రవిడ్ విలేకర్ల సమావేశంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా కొందరు విలేకర్లు ద్రవిడ్‌ను పాక్ బౌలింగ్ లైనప్‌పై ప్రశ్నించారు. దీనికి ద్రవిడ్ సమాధానమిస్తూ.. "హా.. వాళ్లు బాగా బౌలింగ్ చేస్తున్నారు. నేను దానిని కాదనను. కానీ, మా కుర్రాళ్లు కూడా వారిని 147 వద్దే అడ్డుకోగలిగారు. కొన్ని సార్లు అంకెల్లో ఒకరు గంటకు 145 కిలోమీట్లర వేగంతో బంతులేశారని.. మరొకరు గంటకు 147 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తున్నట్లు ఉంటుంది. అంతిమంగా బౌలింగ్ గణాంకాల విశ్లేషణే ముఖ్యం. చివరికి మనం గంటకు 135, 145 లేదా 125 కిలోమీటర్ల వేగంతో బంతులేస్తున్నామా.. బంతిని స్వింగ్ చేస్తున్నామా లేదా అన్నది కాదు. ఫలితాలే ముఖ్యం. మన బౌలర్ల గణంకాలు బాగున్నాయి. నేను పాక్ బౌలింగ్‌ను గౌరవిస్తాను. కానీ.. మనకూ మంచి బౌలింగ్ దళం ఉంది. మేము గ్లామర్‌గా కనిపించకపోవచ్చు. కానీ, ఫలితాలు సాధించే కుర్రాళ్లు మావద్ద ఉన్నారు" అని పేర్కొన్నాడు.
ఈ క్రమంలో బౌలింగ్ దళం గురించి చెబుతూ.. నోటి దాకా వచ్చిన ఓ పదాన్ని రాహుల్ బలవంతంగా ఆపుకోవడాన్ని విలేకర్లు గమనించారు. ఆ పదం 'ఎగ్జూబిరెంట్' (అతిశయమైన) కదా అని ఓ విలేకరి రెట్టించి అడిగారు. దీనికి స్పందించిన ద్రవిడ్ "లేదు.. అదికాదు. అది 'ఎస్'తో మొదలయ్యే నాలుగు అక్షరాల పదం" అని చెప్పాడు.
-
Jammy Sir trying to avoid using ‘Sexy’ for pak bowlers 🤣 #indvPakpic.twitter.com/lT2AAmnNuv
— Mon (@4sacinom) September 3, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Jammy Sir trying to avoid using ‘Sexy’ for pak bowlers 🤣 #indvPakpic.twitter.com/lT2AAmnNuv
— Mon (@4sacinom) September 3, 2022Jammy Sir trying to avoid using ‘Sexy’ for pak bowlers 🤣 #indvPakpic.twitter.com/lT2AAmnNuv
— Mon (@4sacinom) September 3, 2022
ఆసియాకప్‌లో సూపర్-4 దశలో నేడు భారత్-పాక్‌లు తలపడనున్నాయి. ఇప్పటికే ఈ టోర్నీలో భారత్ ఒకసారి పాక్‌ను ఓడించింది. అదే సమయంలో భారత్ బౌలర్ రవీంద్ర జడేజా గాయం కారణంగా జట్టు నుంచి వైదొలగ్గా.. మరోవైపు పాక్ బౌలర్ షానవాజ్ దహానీ కూడా గాయపడ్డాడు.
ఇవీ చదవండి: భారత్‌తో మ్యాచ్ అంటేనే తీవ్ర ఒత్తిడి.. మాకు అండగా నిలవండి: పాక్ క్రికెటర్
సలామ్ సెరెనా.. ఎన్నో సవాళ్లు దాటి అత్యున్నత స్థాయికి.. కానీ చివరి కోరిక తీరకుండానే