టీమ్ఇండియా కొత్త కోచ్ రాహుల్ ద్రవిడ్ ఎంపికయ్యాడు. భారత క్రికెట్ సలహా మండలి.. అతడిని కోచ్‌గా బీసీసీఐ ప్రతిపాదనకు పంపింది. దీంతో ద్రవిడ్ కోచ్‌గా నియమిస్తూ బీసీసీఐ, బుధవారం అధికారికంగా ప్రకటన చేసింది. న్యూజిలాండ్ టీ20 సిరీస్‌తో బాధ్యతలు అందుకోనున్న ద్రవిడ్.. రెండేళ్ల పాటు హెడ్ కోచ్‌గా ఉండనున్నారు.
బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీకి హెడ్‌గా ఉన్న ద్రవిడ్.. ఇప్పుడు టీమ్ఇండియా ఆటగాళ్లకు మార్గనిర్దేశనం చేయనున్నారు. భారత్ అండర్-19, ఏ జట్లకు కోచ్‌గా పనిచేసిన ఆయన.. టీమ్ఇండియా పురుషుల జట్టుకు హెడ్ కోచ్‌గా చేయనుండటం అభిమానుల్లో ఆనందం కలిగిస్తోంది.
1996-2012 మధ్య టీమ్ఇండియాకు ప్రాతినిధ్యం వహించిన ద్రవిడ్.. మొత్తంగా 164 టెస్టులు, 344 వన్డేలు, ఓ టీ20 ఆడాడు. 48 సెంచరీలు అతడి ఖాతాలో ఉన్నాయి.