ETV Bharat / sports

'సార‌థిగా కంటే బౌల‌ర్‌గానే జ‌ట్టుకు బుమ్రా అవ‌స‌రం'

Jasprit Bumrah: కపిల్ దేవ్ తర్వాత టెస్టు కెప్టెన్సీ అందుకున్న ఏకైక ఫాస్ట్ బౌలర్​గా రికార్డు సాధించిన జస్ప్రీత్ బుమ్రాపై ఎంతో మంది సీనియర్​ ఆటగాళ్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఒక ఫాస్ట్ బౌల‌ర్ సార‌థిగా వ్య‌వ‌హ‌రించ‌డం అంత సుల‌భ‌మైన‌ విష‌య‌మేమీ కాద‌ని కోచ్​ ద్రవిడ్ అన్నాడు. త‌న బౌలింగ్‌పై దృష్టి పెట్ట‌డ‌మే కాకుండా, అదే స‌మ‌యంలో ఫీల్డింగ్‌ను సెట్ చేయాల్సి ఉంటుంద‌ని చెప్పాడు. మరోవైపు, బుమ్రాకు కెప్టెన్సీ ఇవ్వడం అద్భుతమని ముంబై ఇండియన్స్ కోచ్​ జయవర్ధనే అన్నాడు.

jaspreet bumrah
jaspreet bumrah
author img

By

Published : Jul 2, 2022, 8:28 AM IST

Jasprit Bumrah Dravid: భార‌త్-ఇంగ్లాండ్ మ‌ధ్య శుక్రవారం ప్రారంభ‌మైన‌ ఐదో టెస్టులో టీమ్​ఇండియా కెప్టెన్ బాధ్య‌త‌లు.. ఫాస్ట్ బౌల‌ర్‌ జ‌స్ప్రీత్ బుమ్రా వహిస్తున్న విష‌యంపై ప్రధాన కోచ్ రాహుల్ ద్ర‌విడ్ స్పందించాడు. కెప్టెన్ రోహిత్ శ‌ర్మ బారిన పడడం వల్ల ఈ టెస్టుకు సారథిగా బుమ్రాకు అవకాశం దక్కింది. దాదాపు 35 ఏళ్ళ త‌ర్వాత ఓ ఫాస్ట్ బౌల‌ర్ టెస్టు జ‌ట్టుకు సార‌థ్య బాధ్య‌త‌లు ద‌క్క‌డం ఇదే తొలిసారి. దీనిపై ద్రవిడ్ ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. బుమ్రా టీమ్​ఇండియా సార‌థిగా కంటే బౌల‌ర్‌గానే జ‌ట్టుకు బాగా అవ‌స‌ర‌మ‌ని అన్నాడు.

"బుమ్రా చాలా శ్ర‌ద్ధ‌తో బాధ్య‌త‌లు నిర్వ‌హించే వ్య‌క్తి. ఆట గురించి బాగా ఆలోచిస్తాడ‌ు. మ్యాచ్​ కొన‌సాగుతున్న తీరును అతడు అర్థం చేసుకుంటాడు. ప్ర‌త్య‌ర్థుల బ్యాటింగ్‌కు త‌గ్గ‌ట్టు తాను ఎలా బౌలింగ్ చేస్తున్నాన‌నే విష‌యాన్నీ తెలుసుకుంటాడు. ఆట గురించి చాలా ఆస‌క్తిగా అన్ని విష‌యాలు తెలుసుకుంటూ తోటి ఆట‌గాళ్లతో చ‌ర్చిస్తాడ‌ు. నాయ‌కుడికి ఉండాల్సిన అన్ని ల‌క్ష‌ణాలు బుమ్రాలో ఉన్నాయి"

-- రాహుల్​ ద్రవిడ్​, ప్రధాన కోచ్​

గ‌తంలో సార‌థిగా వ్య‌వ‌హరించిన అనుభ‌వం అంత‌గా లేక‌పోయిన‌ప్ప‌టికీ బుమ్రాకు తాము మ‌ద్దతు తెలుపుతామ‌ని ద్రవిడ్ చెప్పాడు. ఒక ఫాస్ట్ బౌల‌ర్ కెప్టెన్​గా వ్య‌వ‌హ‌రించ‌డం అంత సుల‌భ‌మైన‌ విష‌య‌మేమీ కాద‌ని తెలిపాడు. త‌న బౌలింగ్‌పై దృష్టి పెట్ట‌డ‌మే కాకుండా, అత‌డు బౌలింగ్ చేస్తున్న స‌మ‌యంలో ఫీల్డింగ్‌ను సెట్ చేయాల్సి ఉంటుంద‌ని చెప్పాడు.

'అదొక అద్భుతం'.. ఇంగ్లాండ్​తో టీమ్​ఇండియా మొదటి టెస్ట్​కు కెప్టెన్​గా వ్యవహరిస్తున్న బుమ్రాపై ముంబయి ఇండియన్స్​ కోచ్​ మహేలా జయవర్ధనే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇటీవలే బుమ్రా భార్య సంజన గణేశన్​తో ఐసీసీ నిర్వహించిన చిట్​చాట్​లో భాగంగా మాట్లాడిన జయవర్ధనే.. బుమ్రాను కెప్టెన్ గా నియమించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నాడు. "ఇది అద్భుతం అనే చెప్పాలి. ఎందుకంటే ఫాస్ట్ బౌలర్​కు కెప్టెన్​గా నియమించడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఇక ఫాస్ట్ బౌలర్ జట్టు కెప్టెన్​గా ఉండాలంటే ఎంతో కష్టపడాలి. టెస్టు క్రికెట్​లో అయితే అనేక సవాళ్లతో కూడి ఉంటుంది. ఇక బుమ్రా టెస్టు కెప్టెన్సీకి సరైనవాడు. గత కొన్నేళ్లుగా ట్రెండ్ మారుతోంది. ఆస్ట్రేలియాకు పాట్ కమిన్స్​ కెప్టెన్​గా మారిన తర్వాత మిగతా దేశాల క్రికెట్ బోర్డులు అదే దారిలో వెళ్లేందుకు ఆలోచన చేస్తున్నాయి." అని జయవర్థనే చెప్పుకొచ్చాడు.

ఇవీ చదవండి: శతక్కొట్టిన పంత్.. ధోనీ రికార్ఢు బద్దలు.. జట్టుకు ఆపద్బాంధవుడిగా..

చెలరేగిన పంత్, జడేజా.. తొలి రోజు ఆట ముగిసే సరికి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.