దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్.. టీమ్ఇండియా కోచ్‌గా(dravid coach) బాధ్యతలు స్వీకరించడం ఇక లాంఛనమే. ప్రస్తుత కోచ్‌గా ఉన్న రవిశాస్త్రి పదవీకాలం.. త్వరలో జరిగే టీ20 ప్రపంచకప్‌తో పూర్తవుతుంది. ఆ తర్వాత న్యూజిలాండ్ పర్యటనతో ద్రవిడ్.. కోచ్‌గా బాధ్యతలు అందుకుంటాడని 2023 వన్డే ప్రపంచకప్ వరకు ఉంటాడని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు.
48 ఏళ్ల ద్రవిడ్(dravid news).. ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ డైరెక్టర్‌గా కొనసాగుతున్నాడు. గత ఆరేళ్ల నుంచి అండర్-19 ప్రపంచకప్ కోసం కుర్రాళ్లు సానబెడుతూ తన మార్క్ చూపించాడు. వాటిలో ఆడిన పృథ్వీషా, పంత్, గిల్, శ్రేయస్ అయ్యర్ లాంటి క్రికెటర్లు ప్రస్తుతం జట్టులో కీలక ఆటగాళ్లుగా ఉన్నారు. ఇప్పుడు ద్రవిడ్ కోచ్‌గా వస్తుండటం, ఆటగాళ్లతో పాటు జట్టుకూ లాభించే అంశం.
రవిశాస్త్రి తర్వాత కోచ్ ఎవరు అని ఆలోచన వచ్చినప్పుడు చాలామంది పేర్లు ప్రస్తావనలోకి వచ్చాయి. కానీ బీసీసీఐ మాత్రం స్వదేశీ వ్యక్తి కోచ్‌గా ఉండాలని భావించింది. ఈ క్రమంలోనే ద్రవిడ్(dravid coach) పేరు తెరమీదకు వచ్చింది. అయితే అతడు తొలుత అంగీకారం తెలపలేదు. కానీ బీసీసీఐ(bcci news) అధ్యక్షుడు గంగూలీ, కార్యదర్శి జైషా.. దాదాపు మూడుసార్లు తర్వాత ఒప్పించారు!
రోహిత్ శర్మ వచ్చే ఏడాది 35లోకి అడుగుపెడతాడు. కోహ్లీకి 33 ఏళ్లు. అజింక్య రహానె, ఇషాంత్ శర్మ, మహ్మమద్ షమి, పుజారా, ఇషాంత్ శర్మ తదితరులు మహా అయితే ఇంకో రెండేళ్లు మాత్రమే జట్టులో కొనసాగుతారు. దీంతో యువ క్రికెటర్లకు అవకాశాలు వచ్చే అవకాశముంది. ఈ సమయంలో ద్రవిడ్(dravid coach) కోచ్‌గా రావడం టీమ్ఇండియాకే కాకుండా యువ ఆటగాళ్లకు లాభంగా మారనుంది.
ఇవీ చదవండి: