ETV Bharat / sports

29 ఏళ్లకే స్టార్​ క్రికెటర్​ రిటైర్మెంట్​! - క్వింటన్​ డికాక్​ దక్షిణాఫ్రికా

Quinton De Kock Retirement: టెస్ట్​ క్రికెట్​ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించాడు దక్షిణాఫ్రికా వికెట్​ కీపర్​ బ్యాట్స్​మెన్​ క్వింటన్​ డికాక్. కుటుంబంతో సమయం గడిపేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు.

Quinton De Kock Retirement
క్వింటన్​ డికాక్​
author img

By

Published : Dec 31, 2021, 1:17 AM IST

Updated : Dec 31, 2021, 6:17 AM IST

Quinton De Kock Retirement: దక్షిణాఫ్రికా క్రికెటర్​ క్వింటన్​ డికాక్​ టెస్టు కెరీర్​కు గుడ్​బై చెప్పాడు. భారత్​తో జరిగిన టెస్టు మ్యాచ్​ ముగిసిన తర్వాత డికాక్​ తన రిటైర్మెంట్​ను ప్రకటించాడు. కుటుంబంతో సమయం గడిపేందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు ఈ సఫారీ వికెట్​ కీపర్​ బ్యాట్స్​మెన్​. 29 ఏళ్లకే డికాక్​ టెస్టుల నుంచి తప్పుకోవడం గమనార్హం.

"బాగా ఆలోచించే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. టెస్టుల నుంచి తప్పుకున్నాక భవిష్యత్తుపై కూడా ఆలోచించాను. నా భార్య సాషా, నేను త్వరలోనే తల్లిదండ్రులం కాబోతున్నాము. ఈ నేపథ్యంలో ఇకపై కుటుంబంతో ఎక్కువ సమయం గడపడం ప్రధానమని భావించాను. అందుకే టెస్ట్​ క్రికెట్​ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది."

-క్వింటన్ డికాక్​, దక్షిణాఫ్రికా క్రికెటర్

ఈ సందర్భంగా తన టెస్ట్​ కెరీర్​కు అండగా నిలిచిన కోచ్​లు, టీమ్​మేట్స్​, మేనేజ్​మెంట్​ సహా స్నేహితులు, కుటుంబసభ్యులకు ధన్యవాదాలు చెప్పుకున్నాడు డికాక్​.

ఇది ముగింపు కాదు..

టెస్టుల నుంచి తప్పుకున్నంత మాత్రాన క్రికెట్​కు స్వస్తి పలికినట్లు కాదన్నాడు డికాక్​. పరిమిత ఓవర్ల క్రికెట్​లో దేశానికి ప్రాతినిధ్యం వహిచేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నాడు.

మొత్తం 54 టెస్ట్​ మ్యాచ్​లు ఆడిన క్వింటన్​.. 38.82 సగటున 3,300 పరుగులు చేశాడు. ఇందులో ఆరు సెంచరీలు ఉన్నాయి. సఫారీ జట్టుకు కొన్నాళ్లు టెస్ట్​ కెప్టెన్​గా కూడా బాధ్యతలు చేపట్టాడు.

ఇదీ చూడండి : దక్షిణాఫ్రికాపై గెలుపు.. టీమ్​ఇండియా ఖాతాలో పలు రికార్డులు

Last Updated : Dec 31, 2021, 6:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.