ETV Bharat / sports

మహిళల ఐపీఎల్​ జట్టును కొనేందుకు​ పంజాబ్​ ఆసక్తి! - పంజాబ్​ సహ యజమాని

Women IPL Punjabkings: వచ్చే ఏడాది ప్రారంభమయ్యే మహిళల ఐపీఎల్ పట్ల తాము చాలా ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు పంజాబ్​ జట్టు సహ యజమాని నెస్​ వాడియా. ఈ లీగ్​లో ఒక జట్టును సొంతం చేసుకోవడానికి తమ ఫ్రాంచైజీ సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.

punjab ness wadia
women ipl 2022
author img

By

Published : Mar 28, 2022, 8:20 PM IST

Women IPL Punjabkings: వచ్చే ఏడాది జరగబోయే మహిళల ఐపీఎల్​లో ఓ జట్టును సొంతం చేసుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు పంజాబ్​ ఫ్రాంచైజీ సహ యజమాని నెస్​ వాడియా తెలిపారు. మహిళల ఐపీఎల్​ పట్ల చాలా ఆసక్తిగా ఉన్నట్లు పేర్కొన్నారు.

"మహిళల ఐపీఎల్​పై మాకు చాలా ఆసక్తిగా ఉంది. ఎప్పటి నుంచో డిమాండ్​ ఉన్నందున బీసీసీఐ నిర్ణయం తీసుకోవడం హర్షనీయం. మహిళల ఐపీఎల్​ నిర్వహించడం ద్వారా బీసీసీఐకి కొన్ని కోట్ల రూపాయల లాభం వస్తుంది. ఈ విషయంపై మేము గంగూలీ, జై షాతో మాట్లాడాం. ఇక, ఈ ఏడాది రెండు కొత్త జట్లు పురుషుల ఐపీఎల్​​లోకి చేరడం వల్ల బీసీసీఐకి ఒక బిలియన్​ డాలర్లకు పైగా లాభం చేకూరింది."

-నెస్​ వాడియా, పంజాబ్​ జట్టు సహ యజమాని

పురుషుల ఐపీఎల్‌ తరహాలోనే వచ్చే ఏడాది నుంచి ఆరు జట్లతో కూడిన మహిళల ఐపీఎల్‌ నిర్వహించనున్నట్లు బీసీసీఐ చీఫ్​ సౌరవ్ గంగూలీ గత వారమే ప్రకటించారు. మహిళల ఐపీఎల్‌కు విపరీతమైన డిమాండ్‌ ఉన్న నేపథ్యంలో గత వారం జరిగిన ఐపీఎల్‌ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఆయా దేశాల్లో మహిళల లీగ్​ క్రికెట్​కు ఆదరణ పెరుగుతోంది. 2015-2016 నుంచి ఆస్ట్రేలియాలో మహిళల క్రికెట్​ బిగ్ బాష్ నిర్వహిస్తున్నారు. గతేడాది యూకేలో మహిళల క్రిెకెట్​ హండ్రెడ్ పోటీ ప్రారంభమవ్వగా, వెస్టిండీస్ ఈ ఏడాది నుంచి మూడు జట్లతో సీపీఎల్ షురూ కానుంది.

ఇదీ చదవండి: మరోసారి పెళ్లి చేసుకున్న మ్యాక్స్​వెల్​ జంట.. ఈ సారి ఆ సంప్రదాయంలో!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.