PBKS Retained Players 2022: కింగ్స్ ఎలెవన్ పంజాజ్ పేరుకు కలిసి రావట్లేదని పంజాబ్ కింగ్స్‌గా జట్టు పేరును మార్చారు. అయినా.. పంజాబ్ తలరాత మారలేదు. ఆఖరిదాకా పోరాడటం అసలైన సమయంలో చేతులెత్తేయడం పంజాబ్ జట్టు నైజంగా మారిపోయింది! దీంతో ఐపీఎల్ 14 సీజన్లో పీబీకేఎస్‌ను గెలిపించేందుకు వీరోచిత పోరాటం చేసిన కేఎల్ రాహుల్(IPL 2022 KL Rahul) ఇక జట్టులో కొనసాగలేనని నిర్మొహమాటంగా చెప్పేశాడు. ఈ నిర్ణయంతో పంజాబ్ కింగ్స్ జట్టు సందిగ్ధంలో పడింది. వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్ మెగా వేలం సమయం ఆసన్నమవుతున్న వేళ ఆ జట్టు ఎవరిని రిటైన్ చేసుకోవాలో తెలియక సతమతమవుతోంది.
నవంబర్ 30లోగా పాత ఫ్రాంఛైజీలు తాము రిటైన్(IPL 2022 Players Retained) చేసుకునే ఆటగాళ్ల పేర్లను సమర్పించాలని ఇప్పటికే బీసీసీఐ పేర్కొంది. ఈ నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ ఎవరిని అట్టిపెట్టుకోనుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే.. ఈ వేలం సందర్భంగా ఏ ఒక్క ఆటగాడిని అట్టిపెట్టుకోకుండా పంజాబ్ కొత్త జట్టుతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.
మయాంక్‌కు రూ. 16 కోట్లా?
రాహుల్ వైదొలుగుతున్న నేపథ్యంలో పంజాబ్ జట్టు మయాంక్ అగర్వాల్‌ను రిటైన్ చేసుకోవచ్చు. అయితే.. అతడి కోసం పంజాబ్ రూ. 16 కోట్లు వెచ్చిస్తుందా? అనే వాదనలే ఎక్కువగా వినిపిస్తున్నాయి.
అన్‌కాప్డ్ ఆటగాళ్లు.. రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్‌లను అట్టిపెట్టుకునేందుకు పంబాబ్ కింగ్స్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే.. వీరిని రిటైన్ చేసుకున్నా పంజాబ్ కింగ్స్ పర్సు నుంచి రూ. 4 కోట్లు మాత్రమే ఖాళీ అవుతుంది.
రాహుల్‌పై కన్నేసిన కొత్త జట్లు..
IPL New Teams Retention: వచ్చే సీజన్ ఐపీఎల్లో రెండు కొత్త జట్లు కూడా పోటీ పడనున్నాయి. అయితే.. అహ్మదాబాద్, లఖ్‌నవూ జట్లు రాహుల్‌ను కెప్టెన్‌గా తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే.. వేలానికి ముందు ఈ రెండు జట్లు ముగ్గురు ఆటగాళ్లను రిటైన్ చేసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్, శిఖర్ ధావన్, డేవిడ్ వార్నర్, హార్దిక్ పాండ్య, సూర్యకుమార్ యాదవ్, ట్రెంట్ బౌల్ట్, మయాంక్ అగర్వాల్‌పై ఆ జట్లు దృష్టి సారించనున్నాయి.
ఇదీ చదవండి:
IPL 2022: ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఐపీఎల్-15 అప్పటినుంచే..!