ETV Bharat / sports

Pujara Suspension : వాళ్లు చేసిన పనికి పుజారాపై వేటు.. ఎందుకంటే? - కౌంటి ఛాంపియన్ షిప్ 2023

Pujara Suspension : టీమ్​ఇండియా టెస్ట్‌ ప్లేయర్​, నయా వాల్‌ ఛెతేశ్వర్‌ పుజారాపై వేటు పడింది. ఆ వివరాలు..

Pujara Suspension
Pujara Suspension
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 19, 2023, 7:19 AM IST

Pujara Suspension : టీమ్​ఇండియా టెస్ట్‌ ప్లేయర్​, నయా వాల్‌ ఛెతేశ్వర్‌ పుజారాపై వేటు పడింది. ఇంగ్లాండ్​ కౌంటీ ఛాంపియన్‌షిప్‌ 2023లో అతడు కెప్టెన్సీ వహిస్తున్న ససెక్స్‌ టీమ్​కు 12 పాయింట్లు పెనాల్టీ పడింది. దీని ఎఫెక్ట్​ సారథైన పుజారాపై పడింది. అతడి ఓ మ్యాచ్‌ సస్పెన్షన్‌ విధిస్తున్నట్లు కౌంటీ ఛాంపియన్‌షిప్‌ నిర్వాహకులు వెల్లడించారు.

ఇంగ్లాండ్ క్రికెట్‌ బోర్డు నిబంధనల ప్రకారం.. ఓ సీజన్‌లో ఓ టీమ్​పై నాలుగు ఫిక్స్‌డ్‌ పెనాల్టీలు పడితే, సదరు టీమ్​ కెప్టెన్‌పై ఓ మ్యాచ్‌ సస్పెన్షన్‌ వేటు పడుతుంది. ప్రస్తుత సీజన్‌లో ససెక్స్‌ నాలుగు ఫిక్స్‌డ్‌ పెనాల్టీలను ఎదుర్కోవాల్సి వచ్చింది. అందుకే పుజారాపై వేటు పడింది. టోర్నీ తొలి లెగ్‌లో రెండు ఫిక్స్‌డ్‌ పెనాల్టీలను ఎదుర్కొన్న ససెక్స్‌.. సెప్టెంబర్‌ 13న లీసెస్టర్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ మరో రెండు పెనాల్టీలను అందుకుంది. దీంతో ఆ జట్టుకు మొత్తం 12 డీమెరిట్‌ పాయింట్లు ఇవ్వడం జరిగింది.

ప్లేయర్లు ఆన్‌ ఫీల్డ్‌ బిహేవియర్​ నిబంధనలకు విరుద్ధంగా ఉండటంటో ససెక్స్‌పై అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. రీసెంట్​గా లీసెస్టర్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో ససెక్స్‌ ప్లేయర్స్​ టామ్‌ హెయిన్స్‌, జాక్‌ కార్సన్‌, అరి కార్వెలాస్‌లు స్టేడియంలో వ్యవహరించిన తీరుకు కెప్టెన్‌ పుజారా బాధ్యుడవ్వాల్సి వచ్చింది. పుజారా సస్పెన్షన్‌ను ససెక్స్‌ యాజమాన్యం కూడా ఎలాంటి వాదనలు లేకుండానే స్వీకరించింది.

County Championship 2023 : ఇకపోతే టామ్‌ హెయిన్స్‌, జాక్‌ కార్సన్‌, అరి కార్వెలాస్​పై కూడా చర్యలు తీసుకున్నారు అధికారులు. టామ్‌ హెయిన్స్‌, జాక్‌ కార్సన్‌ తదుపరి మ్యాచ్‌లో ఆడకుండా వేటు వేశారు. కార్వెలాస్‌పై విచారణ అనంతరం చర్యలు తీసుకుంటారని తెలిసింది. కాగా, ఈ డీమెరిట్ పాయింట్ల వల్ల.. ప్రస్తుత కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో ససెక్స్‌ మూడో నుంచి ఐదో స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం ససెక్స్‌ 124 పాయింట్లతో ఉంది. ఇక ఈ కౌంటీ డివిజన్‌ 2 పోటీల్లో భాగంగా ససెక్స్‌.. సెప్టెంబర్‌ 19-22 వరకు డెర్బీషైర్‌తో, సెప్టెంబర్‌ 26నుంచి గ్లోసెస్టర్‌షైర్‌తో తలపడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్‌ల తర్వాత ప్రస్తుత సీజన్‌ ముగుస్తుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 198 పాయింట్లతో డర్హమ్‌ జట్టు టాప్​లో ఉంది.

  • Full team news and comments for our upcoming trip to Derbyshire following today's announcement by the ECB relating to disciplinary issues during our match last week. 📝 ⬇ #GOSBTS

    — Sussex Cricket (@SussexCCC) September 18, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

టీమ్ఇండియాలో పుజారాకు డోర్ క్లోజ్​.. అతడి కెరీర్ ముగిసినట్టేనా?

దుమ్మురేపిన పుజారా.. దులీప్​ ట్రోఫీలో 'సూపర్'​ సెంచరీ..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.