ETV Bharat / sports

రంజీల్లో టీమ్​ఇండియా 'టెస్టు'​ స్పెషలిస్ట్​లు- రాణించకుంటే అంతే..!

Pujara Rahane: కొంతకాలంగా ఫామ్​ లేమితో సతమతమవుతున్న టీమ్​ఇండియా టెస్టు స్పెషలిస్ట్​లు.. ఛెతేశ్వర్​ పుజారా, అజింక్యా రహానె రంజీల్లో ఆడనున్నారు. ఈ మేరకు ఆయా జట్ల జాబితాలో వీరిని చేర్చాయి.

author img

By

Published : Feb 8, 2022, 5:21 PM IST

Pujara Rahane: వరుసగా విఫలం అవుతున్న టీమ్​ఇండియా టెస్టు స్పెషలిస్టులు ఛెతేశ్వర్​ పుజారా, అజింక్యా రహానె.. రంజీ ట్రోఫీలో ఆడనున్నారు. జయ్​దేవ్​ ఉనద్కత్​ సారథ్యం వహించనున్న సౌరాష్ట్ర జట్టుకు పుజారా ప్రాతినిధ్యం వహించనున్నాడు. యంగ్​ క్రికెటర్​ పృథ్వీ షా కెప్టెన్​గా వ్యవహరిస్తున్న ముంబయి తరఫున బరిలోకి దిగనున్నాడు రహానె.

ఈ ఇద్దరూ కొంతకాలంగా టెస్టుల్లో ఆశించిన రీతిలో రాణించలేకపోతున్నారు. నెల కిందట జరిగిన సౌతాఫ్రికా సిరీస్​లో మరీ దారుణంగా ఆడారు. మూడు మ్యాచుల ఈ సిరీస్​లోని ఆరు ఇన్నింగ్స్​లో కలిపి పుజారా(124), రహానె(136) పరుగులు మాత్రమే చేశారు. త్వరలో శ్రీలంక.. భారత్​లో పర్యటించనుంది. ఈ నేపథ్యంలోనే రంజీలో సత్తాచాటి.. మళ్లీ టీమ్​ ఇండియాలోకి రావాలని ఆశిస్తున్నారు.

పడిపోయిన సగటు..

  • రహానె చివరగా ఆసీస్​పై మెల్​బోర్న్​లో సెంచరీ చేశాడు. రెండేళ్లలో అతడి గురించి చెప్పుకోదగిన మ్యాచ్​ ఇదొక్కటే. అప్పటినుంచి 27 ఇన్నింగ్స్​ల్లో 20.25 సగటుతో 547 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో 3 అర్ధసెంచరీలు ఉన్నాయి. ఈ సమయంలో అతని కెరీర్​ యావరేజ్​ కూడా 43 నుంచి 39కి పడిపోయింది.
  • రహానె చివరగా 2019-20 సీజన్​లో రంజీ ట్రోఫీలో పాల్గొన్నాడు. అప్పుడు ముంబయి ఆడిన 8 లీగ్​ మ్యాచ్​ల్లో ఒకటే గెలిచి.. నాకౌట్​కు అర్హత సాధించలేకపోయింది.

మూడేళ్లయింది..

  • పుజారా కూడా ఆసీస్​పైనే మూడేళ్ల కింద చివరగా మూడంకెల స్కోరు చేశాడు. ఆ తర్వాత.. మళ్లీ ఆ మార్కు చేరుకోలేదు. అప్పటినుంచి 48 టెస్టు ఇన్నింగ్స్​లు ఆడగా.. 27.38 సగటుతో 1287 పరుగులే చేశాడు. 91 అత్యధిక స్కోరు. ఈ సమయంలో పుజారా యావరేజ్​ 47 నుంచి 44.25కు తగ్గింది.
  • పుజారా చివరగా 2019-20 సీజన్​లోనే ఫైనల్​ మ్యాచ్​ ఆడాడు. బంగాల్​పై 66 పరుగులు సాధించి.. సౌరాష్ట్ర టైటిల్​ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.

ప్రస్తుత రంజీ ట్రోఫీలో సౌరాష్ట్ర, ముంబయి.. ఒడిశా, గోవాలతో కలిసి గ్రూప్​-డిలో ఉన్నాయి. ఈ లీగ్​ మ్యాచ్​లన్నీ అహ్మదాబాద్​లోనే జరగనున్నాయి.

Ranji Trophy 2022: రంజీ టోర్నీ ఫిబ్రవరి 10 నుంచి జరగనుండగా.. శ్రీలంకతో ఇండియా సిరీస్​ లోపు వీరు ఫామ్​లోకి రావాలని ఆశిస్తున్నారు సెలక్టర్లు.

గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు..

"ఆ ఆటగాళ్లు రంజీ ట్రోఫీలో ఆడతారని, చాలా పరుగులు చేస్తారని ఆశిస్తున్నాను. వారు తప్పకుండా సాధిస్తారని భావిస్తున్నాను. రంజీ ట్రోఫీ చాలా ముఖ్యమైన టోర్నీ. మేమంతా కూడా ఇందులో పాల్గొన్నాం" అని గంగూలీ కొద్దిరోజుల కిందట పుజారా, రహానెలను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

రెండు విడతలుగా...

కరోనా కారణంగా గత సీజన్​ జరగలేదు. అందుకే ఈసారి రెండు దశల్లో నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తొలిదశ మ్యాచ్​లు ఫిబ్రవరి 10- మార్చి 15 వరకు, రెండో దశ మే 30 నుంచి జూన్ 26 వరకు జరగనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జైషా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ జట్టు గ్రూప్​-ఈలో, హైదరాబాద్​ జట్టు ఎలైట్ గ్రూప్-బీలో ఉన్నాయి.

ఇవీ చూడండి: Pujara and Rahane: రహానే- పుజారాపై అభిమానులు ఫైర్..

రహానె, పుజారా భవితవ్యం.. కోహ్లీ ఏమన్నాడంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.