పాకిస్థాన్ సూపర్ లీగ్(PSL) పూర్తయింది. గురువారం రాత్రి జరిగిన ఫైనల్లో పెషావర్ జాల్మీపై గెలిచిన ముల్తాన్ సుల్తాన్స్(Multan Sultans).. తొలి టైటిల్‌ను దక్కించుకుంది. అయితే ఐపీఎల్‌తో(IPL) పోలిస్తే పీఎస్ఎల్ విజేతకు ఇచ్చే ప్రైజ్‌మనీ ఎంత?
కరోనా కారణంగా ఈ ఏడాది ప్రారంభమైన పీఎస్ఎల్ మధ్యలోనే నిలిచిపోయింది. దీంతో మిగిలిన మ్యాచ్‌ల్ని యూఏఈ(UAE) వేదికగా నిర్వహించారు. ఈ క్రమంలో పాయింట్ల పట్టికలో దిగువన ఉన్న ముల్తాన్ సుల్తాన్స్.. రెండో అర్ధభాగంలో తమ సత్తా చూపింది. ఒక్కో జట్టును ఓడిస్తూ, టోర్నీ చరిత్రలో తొలిసారి టైటిల్‌ను గెలుచుకుంది. ఫలితంగా రూ.3.5 కోట్లు ప్రైజ్‌మనీ అందుకుంది.
అదే ఐపీఎల్లో అయితే విజేతకు రూ.20 కోట్లు, రన్నర్‌కు రూ.12.5 కోట్లు ఇచ్చేవారు. కానీ కరోనా ప్రభావంతో ఖర్చుల తగ్గించుకున్న తర్వాత గత సీజన్లో టైటిల్ గెలిచిన జట్టుకు రూ.10 కోట్లు, ఫైనల్లో ఓడిన జట్టుకు రూ.6.25 కోట్లు ప్రస్తుతం ఇస్తున్నారు.
ఏప్రిల్-మేలో ఐపీఎల్ జరుగుతున్న సమయంలో పలువురు ఆటగాళ్లకు కొవిడ్(COVID) పాజిటివ్‌గా తేలిన కారణంగా సీజన్ మధ్యలోనే నిలిచిపోయింది. దీంతో మిగిలిన మ్యాచ్‌ల్ని యూఏఈ వేదికగా సెప్టెంబరు-అక్టోబరులో జరపాలని బీసీసీఐ(BCCI) నిర్ణయించింది.
ఇవీ చదవండి: