ETV Bharat / sports

డోపింగ్​పై పృథ్వీ.. అలా చేయడం తప్పే! - పృథ్వీ షా డోపింగ్​

టీమ్​ఇండియా యువ ఓపెనర్​ పృథ్వీ షా.. గతంలో డోపింగ్​కు ఎందుకు పాల్పడ్డాడో వివరించాడు. అది తాను తెలియక చేసిన తప్పని వెల్లడించాడు.

Prithvi shaw
షా
author img

By

Published : May 24, 2021, 9:33 AM IST

టీమ్‌ఇండియా యువ ఓపెనర్‌ పృథ్వీ షా 2019లో డోపింగ్‌ టెస్టులో పట్టుబడి 8 నెలలు నిషేధానికి గురయ్యాడు. అది తెలియక చేసిన తప్పని, అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో తాజాగా ఓ క్రీడా ఛానెల్‌తో వివరించాడు. అందుకు తాను, తన తండ్రి కారణమని పృథ్వీ అన్నాడు.

"డోపింగ్‌ టెస్టులో పట్టుబడటానికి నేనూ, మా నాన్న కారణం. ఆ సమయంలో నేను ఇండోర్‌లో సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ ఆడుతుండగా జలుబు, దగ్గుతో ఇబ్బందిపడ్డా. రాత్రి భోజనం చేసేందుకు బయటకు వెళ్లాక విపరీతమైన దగ్గు వచ్చింది. దాంతో మా నాన్నను సంప్రదిస్తే బయట మార్కెట్‌లో దొరికే కాఫ్‌ సిరప్‌ తీసుకోమని చెప్పారు. అప్పుడు ఫిజియోను సంప్రదించకుండా నిషేధించిన ఆ డ్రగ్‌ తీసుకోవడమే నేను చేసిన తప్పు. రెండురోజులు ఆ సిరప్‌ తీసుకున్నాక, మూడో రోజే డోపింగ్‌ టెస్టు నిర్వహించారు. దాంతో నేను పాజిటివ్‌గా దొరికిపోయా. దాని గురించి మాటల్లో చెప్పలేను" అని పృథ్వీ తన చేదు అనుభవాన్ని పంచుకున్నాడు.

అది తనకు కష్టతరమైన సందర్భమని, ఆ సమయంలో ప్రజలు తన గురించి ఏమనుకుంటారోనని ఆందోళన చెందినట్లు ఈ ముంబయి బ్యాట్స్‌మన్‌ పేర్కొన్నాడు. కెరీర్‌లో మంచి స్థితికి చేరుతున్న వేళ ఇలా ఒక్కసారిగా పరిస్థితి మారిపోవడం బాధగా అనిపించిందన్నాడు పృథ్వీ. రెండున్నర నెలలు దాని గురించే ఆలోచించానని తెలిపాడు.

కాగా, బీసీసీఐ ఆ సమయంలో పృథ్వీకి 8 నెలల నిషేధం విధించగా అందులో అప్పటికే ఎక్కువ శాతం అంతర్జాతీయ ఆటకు దూరమైన కాలాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. దాంతో కేవలం రెండున్నర నెలల్లోనే ఈ యువ ఓపెనర్‌ నిషేధ కాలాన్ని పూర్తి చేసుకున్నాడు. తర్వాత 2020 ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌ పర్యటనకు ఎంపికైనా ఆకట్టుకోలేకపోయాడు. ఈ క్రమంలోనే గతేడాది ఐపీఎల్‌లోనూ విఫలమయ్యాడు. అనంతరం ఆస్ట్రేలియా పర్యటనలో తొలి టెస్టు తర్వాత జట్టుకు మళ్లీ దూరమయ్యాడు. అయితే, ఇటీవల దేశవాళీ క్రికెట్‌లో తన తప్పులు సరిదిద్దుకొని అద్భుతంగా రాణిస్తున్నాడు. ఐపీఎల్‌ 14వ సీజన్‌లోనూ పలు కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.