ETV Bharat / sports

లంకేయులపై జైత్రయాత్రకు రోహిత్​ సేన సిద్ధం.. అందరి కళ్లూ అతనిపైనే.. - కోహ్లీ 100వ టెస్టు మ్యాచ్​

India Vs srilanka First Test: రెండు టెస్టుల సిరీస్​లో భాగంగా శుక్రవారం భారత్​, శ్రీలంక మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. రోహిత్ శర్మ తొలిసారి పూర్తి స్థాయి టెస్టు కెప్టెన్​గా బాధ్యతలు చేపడుతున్నాడు. మాజీ సారథి విరాట్ కోహ్లీ 100వ టెస్టు ఆడనున్నాడు. మరోవైపు భారత గడ్డపై తొలి టెస్టు విజయం సాధించాలని శ్రీలంక పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్​కు సంబంధించిన మరిన్ని వివరాలు..

PREVIEW: Rohit's Team India ready to dish out stellar show in King Kohli's 100th Test
లంకేయులపై జైత్రయాత్రకు రోహిత్​ సేన సిద్ధం.. అందరి కళ్లూ అతనిపైనే..
author img

By

Published : Mar 3, 2022, 5:59 PM IST

Updated : Mar 3, 2022, 7:14 PM IST

IND Vs SL Preview: శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్ కోసం భారత్ సిద్ధమైంది. పంజాబ్​ మొహాలి వేదికగా శుక్రవారం ప్రారంభంకానున్న మొదటి టెస్టులో విజయం సాధించి లంకేయులపై జైత్రయాత్ర కొనసాగించాలని రోహిత్ సేన భావిస్తోంది. మరోవైపు భారత గడ్డపై ఈసారైనా తొలి టెస్టు విజయం సాధించి చరిత్ర సృష్టించాలని శ్రీలంక పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్​తో రోహిత్ శర్మ తొలిసారి పూర్తిస్థాయి టెస్టు కెప్టెన్​గా బరిలోకి దిగుతున్నాడు. అతడు టెస్టు పగ్గాలు చేపడుతున్న 35వ భారతీయ ఆటగాడు కావడం గమనార్హం.

Kohli 100th test

అందరి కళ్లూ కోహ్లీ పైనే..

ఈ మ్యాచ్​లో అందరి దృష్టి మాజీ సారథి కోహ్లీ పైనే ఉంది. అతడు 100వ టెస్టు మైలురాయిని చేరుకుంటుండటమే ఇందుకు కారణం. ఈ మ్యాచ్​లో అయినా సెంచరీ చేసి అభిమానులు రెండేళ్ల నిరీక్షణకు తెరదించుతాడని అందరూ భావిస్తున్నారు. అలాగే 100వ టెస్టులో 100 పరుగులు చేసిన తొలి భారతీయ ఆటగాడిగా కూడా అతడు రికార్డు నెలకొల్పే అవకాశముంది. గావస్కర్​, సచిన్, గంగూలీ, సెహ్వాగ్ వంటి దిగ్గజ ఆటగాళ్లు ఈ ఘనతకు సాధించలేకపోయారు. ఇప్పుడు ఆ సదావకాశం కోహ్లీకి దక్కనుంది.

ఇదీ చదవండి: 100వ టెస్టులో సెంచరీ వీరులు వీరే.. మరి కోహ్లీ..?

టెస్టుల్లో సునిల్ గావస్కర్​ 10వేల పరుగులు చేసినప్పుడు, సచిన్ తెందుల్కర్​ రిటైర్​మెంట్ ప్రకటించినప్పుడు భారతీయ అభిమానులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. క్రికెట్​ను ఆరాధ్యంగా భావించే మన దేశంలో ఇప్పుడు కోహ్లీ 100వ టెస్టు మ్యాచ్​ ఆడుతుండటం కూడా అలాంటి సందర్భమే. అతడి సారథ్యంలోనే టెస్టు క్రికెట్​లో భారత్​ చరిత్రాత్మక విజయాలు సాధించింది. దీన్ని దృష్టిలో ఉంచుకునే మొహాలిలో జరిగే మ్యాచ్​కు పరిమిత సంఖ్యలో ప్రేక్షకులను అనుమతిస్తున్నారు.

ఇదీ చదవండి: టెస్టు చరిత్రలో స్వర్ణయుగం.. కోహ్లీ శకం- ఈ రికార్డులపై ఓ లుక్కేయండి

ఓసారి ఇరు జట్ల వివారాలను పరిశీలిద్దాం..

India Srilanka first test

టీమ్​ఇండియా స్క్వాడ్​..

రోహిత్ శర్మ(కెప్టెన్​), మయాంక్ అగర్వాల్​, శుభ్​మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషభ్​పంత్(కీపర్)​, హనుమ విహారి, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, జస్​ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, జయంత్ యాదవ్, శ్రేయస్ అయ్యర్​, కోన భరత్​(కీపర్​), ఉమేశ్ యాదవ్, సౌరభ్ కుమార్, ప్రియాంక్ పంచాల్​.

తుది జట్టు అంచనా..

రోహిత్ శర్మ(కెప్టెన్​), మయాంక్ అగర్వాల్​, శుభ్​మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషభ్​పంత్​, హనుమ విహారి, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, జస్​ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్.

శ్రీలంక స్క్వాడ్​..

దిముత్​ కరుణరత్నే(కెప్టెన్​), దనంజయ డిసిల్వ, ఛరిత్ అసలంక, దుశ్మంత చమీర, దినేశ్ చండీమల్(కీపర్​)​, ఏంజిలో మాథ్యూస్​, నిరోశన్​ డిక్​వెల్లా, లసిత్ ఎంబుల్దేనియా, విశ్వ ఫెర్నాండో, సురంగ లక్మల్​, లాహిరు తిరుమణ్నె, లాహిరు కుమార, కుశాల్ మెండిస్​(కీపర్​), పథుం నిస్సాంక, జెఫ్రే వాండర్సే, ప్రవీణ్ జయవిక్రమ, చమిక కరుణరత్నే.

తుది జట్టు అంచనా..

దిముత్​​ కరుణరతనే(కెప్టెన్​), పథుం నిస్సాంక, లాహిరు తిరుమణ్నె, ఏంజిలో మాథ్యూస్​, దనంజయ డిసిల్వ,ఛరిత్ అసలంక, దినేశ్ చండీమల్, ప్రవీణ్ జయవిక్రమ, సురంగ లక్మల్, లసిత్ ఎంబుల్దేనియా, దుశ్మంత చమీర.

ఇరు జట్ల రికార్డు..

ఇప్పటి వరకు భారత్, శ్రీలంక మధ్య 44 టెస్టు మ్యాచ్​లు జరగ్గా... టీమిండియా 20 మ్యాచ్​ల్లో గెలిచింది. శ్రీలంక 7 మ్యాచ్​ల్లో విజయం సాధించింది. 17 మ్యాచ్​లు డ్రాగా ముగిశాయి.

ఏ ఛానల్​లో చూడొచ్చంటే..

మ్యాచ్​ శుక్రవారం ఉదయం 9:30గంటలకు ప్రారంభమవుతుంది. స్టార్​స్పోర్ట్స్​ ఛానల్​లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. డిస్నీ ప్లస్​ హాట్​స్టార్​లో లైవ్​ స్ట్రీమింగ్ ద్వారా​ కూడా చూడవచ్చు.

ఇదీ చదవండి: ఐపీఎల్​ తర్వాత మరో రసవత్తర సిరీస్​కు టీమ్​ఇండియా రెడీ

Last Updated : Mar 3, 2022, 7:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.