Praveen kumar accident :టీమ్ఇండియా మాజీ క్రికెటర్ ప్రవీణ్ కుమార్‌కు తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని పాండవ్ నగర్ నుంచి మీరట్‌కు ప్రయాణిస్తుండగా.. అతడి కారు ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. అతడి కారును వేగంగా వస్తున్న క్యాంటర్ వాహనం వచ్చి ఢీ కొట్టినట్లు తెలిసింది. ఆ సమయంలో ప్రవీణ్‌తో పాటు అతడి కుమారుడు కారులో ప్రయాణిస్తున్నారు. అయితే అదృష్టం కొద్దీ వీరిద్దరు ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డారు.
కానీ వీరు ప్రయాణిస్తున్న కారు మాత్రం నుజ్జునుజ్జైంది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడం వల్ల క్రికెట్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ యాక్సిండెంట్ గురించి తెలుసుకున్న పోలీసులు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకున్న క్యాంటర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారట. మీరట్ నగరానికి ప్రవేశిస్తుండగా మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. కాగా, ప్రవీణ్ కుమార్ మీరట్ బాగ్‌పత్ రోడ్‌లోని ఉన్న ముల్తాన్ నగర్‌లో నివాసం ఉంటున్నాడు.
Cricketer Praveen kumar Stats : ఇక 36 ఏళ్ల ప్రవీణ్ కుమార్ విషయానికొస్తే.. 2007 నుంచి 2012 వరకు టీమ్ఇండియాకు ప్రాతినిథ్యం వహించాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో.. బౌలర్‌గా రాణించి తన ప్రదర్శనతో క్రికెట్ అభిమానులను ఆకట్టుకున్నాడు. 2008లో ఆస్ట్రేలియాలో జరిగిన కామన్‌వెల్త్ బ్యాంక్ సిరీస్‌లో టీమ్ఇండియా గెలవడంలో కీలక పాత్ర పోషించాడు ప్రవీణ్.
మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రవీణ్.. 68 వన్డేల్లో 77 వికెట్లు, 10 టీ20ల్లో 8 వికెట్లు, 6 టెస్ట్ మ్యాచ్‌లు 27 వికెట్లు పడగొట్టాడు. ఇంటర్నేషనల్ క్రికెట్లోనే కాకుండా అతడు ఐపీఎల్‌లోనూ మంచిగా రాణించాడు. మొత్తం 119 మ్యాచ్‌లు ఆడి 90 వికెట్లు దక్కించుకున్నాడు. అలానే అడపాదడపా బ్యాటింగ్ చేసిన ఈ రైట్ ఆర్మ్ మీడియం పేస్ బౌలర్.. వన్డేల్లో ఓ హాఫ్ సెంచరీ కూడా బాదాడు.
Rishab pant accident : ఇకపోతే గతేడాదే టీమ్ఇండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ కూడా ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అతడు కూడా సురక్షితంగానే బయటపడ్డాడు. కానీ గాయాలు బాగానే అయ్యాయి. శస్త్రచికిత్సలు జరిగాయి. అప్పటి నుంచి క్రికెట్‌కు దూరంగా ఉంటున్న అతడు దాదాపుగా కోలుకున్నాడు. త్వరలోనే మళ్లీ క్రికెట్‌లో అడుగుపెట్టనున్నాడు.
ఇదీ చూడండి :