భారత్-న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన రెండో టీ20ని(ind vs nz t20) వాయిదా వేయాలని ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. న్యాయవాది ధీరజ్ కుమార్.. ఝార్ఖండ్ హైకోర్టులో పిల్ వేశారు. మ్యాచ్ చూసేందుకు 100 శాతం ప్రేక్షకులను ఎలా అనుమతిస్తారని అన్నారు.
రాష్ట్రంలో కొవిడ్(covid-19) భయంతో ఇంకా పాఠశాలలు మూసే ఉన్నాయని.. వైరస్ భయం వల్ల విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారని ధీరజ్ తన వ్యాజ్యంలో పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో తమ దగ్గర జరిగే క్రికెట్ మ్యాచ్‌కు(cricket match) 100 శాతం మంది వీక్షకులను ఎలా అనుమతిస్తారని అడిగారు.
మ్యాచ్‌ను వాయిదా వేయడం లేదా 50 శాతం మంది వీక్షకులనే అనుమతిస్తూ నిర్ణయం తీసుకోవాలని న్యాయవాది ధీరజ్.. హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు.
శుక్రవారం(నవంబరు 19).. ఝార్ఖండ్ మైదానంలో టీమ్‌ఇండియా- న్యూజిలాండ్ రెండో టీ20(ind vs nz t20) జరగనుంది. ఇప్పటికే తొలి మ్యాచ్‌లో గెలిచిన భారత్.. ఇందులోనూ గెలిచి సిరీస్ దక్కించుకోవాలని చూస్తోంది.
అంతకుముందు జైపూర్‌లో బుధవారం జరిగిన తొలి టీ20లో(ind vs nz t20 series 2021) న్యూజిలాండ్‌పై భారత్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. అనంతరం టీమ్‌ఇండియా నాలుగు వికెట్లను కోల్పోయి 19.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది.
సూర్యకుమార్ యాదవ్ (62), కెప్టెన్ రోహిత్ శర్మ (48) రాణించారు. తొలి వికెట్‌కు కేఎల్ రాహుల్ (15)తో కలిసి రోహిత్ అర్ధశతక భాగస్వామ్మం నిర్మించాడు. రాహుల్ ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన సూర్యకుమార్‌తో కలిసి రోహిత్ ఇన్నింగ్స్‌ను పరుగులు పెట్టించాడు. వీరిద్దరూ కలిసి మరో అర్ధశతకం (59) జోడించారు.
రోహిత్ ఔటైనప్పటికీ సూర్యకుమార్(suryakumar yadav stats) ధాటిగానే బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలో టీ20 కెరీర్‌లో మూడో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. అయితే దూకుడుగా ఆడుతున్న సూర్యకుమార్ కివీస్ బౌలర్ బౌల్ట్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. రిషభ్ పంత్ 12*, శ్రేయస్ అయ్యర్ 5, వెంకటేశ్ అయ్యర్ 4 పరుగులు చేశారు. కివీస్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 2, సౌథీ, డారిల్ మిచెల్, సాంట్నర్ తలో వికెట్ తీశారు.
ఇవీ చదవండి: