ETV Bharat / sports

శ్రీలంక వన్డే జట్టుకు కొత్త కెప్టెన్ - శ్రీలంక బంగ్లాందేశ్ సిరీస్​

శ్రీలంక పరిమిత ఓవర్ల జట్టుకు కొత్త కెప్టెన్​ను నియమించారు. కుశాల్​ పెరీరాకు ఆ బాధ్యతలు అప్పగించారు. బంగ్లాదేశ్​తో త్వరలో జరగనున్న సిరీస్​ కోసం పలువురు ఆటగాళ్లను పక్కనపెట్టి కొత్తవాళ్లకు అవకాశమిచ్చింది లంక బోర్డు.

Perera
పెరీరా
author img

By

Published : May 12, 2021, 7:18 PM IST

బంగ్లాదేశ్​తో ఈ నెలలో జరగబోయే సిరీస్​ కోసం జట్టులో కీలక మార్పులు చేసింది శ్రీలంక. అనంతరం టీమ్​ను ప్రకటించింది. ప్రస్తుతం వన్డే జట్టుకు సారథిగా ఉన్న దిముత్ కరుణరత్నెను తప్పించి కుశాల్​ పెరీరాను కొత్త సారథిగా, కుశాల్​ మెండీస్​ను వైస్​ కెప్టెన్​గా నియమించారు. వెస్టిండీస్​తో పరిమిత ఓవర్ల సిరీస్​లో ఓడిన నేపథ్యంలో బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ​పెరీరా​ ఇప్పటివరకు 101 వన్డేలు, 22టెస్టులు, 47టీ20లు ఆడాడు.

కరుణరత్నెతో పాటు ఆల్​రౌండర్​ మాథ్యూస్, వికెట్​ కీపర్​ దినేశ్ చండిమల్, టాప్​ ఆర్డర్​ బ్యాట్స్​మన్​ లహిరు తిరమన్నేను పక్కన పెట్టింది. పేసర్​ చమిక కరుణరత్నె, బ్యాట్స్​మన్​ షిరాన్​ ఫెర్నాండొ, స్పీడ్​స్టర్​ బినురా ఫెర్నాండొ(ఇప్పటికే 2 టీ20లు ఆడాడు) పరిమిత ఓవర్ల సిరీస్​ అరంగేట్రం చేయనున్నారు.

బంగ్లాదేశ్​తో మూడు మ్యాచ్​ల వన్డే సిరీస్​ను(మే 23-28) ఢాకాలో ఆడనుంది శ్రీలంక. ఇందుకోసం మే 16న వీరు బయలుదేరనున్నారు.

జట్టు​:

కుశాల్​ పెరీరా(సారథి), కుశాల్​ మెండిస్​(వైస్​ కెప్టెన్​), ధనుష్క గుణతిలక, ధనం​జయ డి సిల్వా, నిస్సాంక, షనక, అషెన్​ బందారా, వనిందు హసరంగ, ఇసురు ఉదానా, అకిల ధనంజయ, నిరోషన్​ దిక్​వెల్లా, దుష్మంతా చమీరా, రమేశ్​ మెండిస్​, అషితా ఫెర్నాండొ, లక్షన్​ సండకన్​, చమికా కరుణారత్నె, బినురా ఫెర్నాండొ, షిరన్​ ఫెర్నాండొ

ఇదీ చూడండి: అంతర్జాతీయ క్రికెట్​కు తిసారా పెరీరా​ వీడ్కోలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.