ETV Bharat / sports

IPL రాకతో పరిస్థితి మారింది.. లేదంటే! - ఓలీ రాబిన్​ సన్​ జాత్యాహంకార వ్యాఖ్యలు

స్త్రీ వివక్ష, జాత్యంహకార ట్వీట్లు చేసిన ఇంగ్లాండ్​ యువ బౌలర్​ ఓలీ రాబిన్‌సన్(Ollie Robinson) శిక్ష అనుభవించాల్సిందేనని టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు ఫరూక్‌ ఇంజినీర్‌ అన్నాడు. బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ అతడికి మద్దతివ్వడం సరికాదని చెప్పాడు. తాను కూడా గతంలో జాతి వివక్ష వ్యాఖ్యలు ఎదుర్కొన్నానని గుర్తుచేసుకున్నారు. ఐపీఎల్‌ రాకతో మొత్తం పరిస్థితి మారిపోయిందని వెల్లడించాడు.

Ollie Robinson
ఓలీ రాబిన్‌సన్
author img

By

Published : Jun 9, 2021, 2:05 PM IST

Updated : Jun 9, 2021, 2:38 PM IST

ఆసియా జాతులపై విద్వేషం, స్త్రీ వివక్ష ట్వీట్లు చేసిన ఇంగ్లాండ్‌ క్రికెటర్‌ ఓలీ రాబిన్‌సన్ శిక్ష అనుభవించాల్సిందేనని టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు ఫరూక్‌ ఇంజినీర్‌ అన్నాడు. యుక్త వయసులో చేసిన ట్వీట్లంటూ బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ అతడికి మద్దతివ్వడాన్ని తప్పుపట్టాడు.

18 ఏళ్లంటే వ్యక్తిగతంగా బాధ్యతలు చేపట్టాల్సిన వయసని ఫరూక్‌ అన్నాడు. కఠినంగా శిక్షించకపోతే భవిష్యత్తు తరాలూ ఇలాగే చేస్తాయని పేర్కొన్నాడు. బ్రిటన్‌ ప్రధాని మాటలు యుక్త వయసు కాబట్టి ఎలాంటి తప్పులైనా చేయొచ్చన్న ధీమా ఇస్తున్నాయని విమర్శించాడు. అలాంటప్పుడు యువత ఆసియా జాతులపై వెకిలి అర్థాలతో వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారని అన్నాడు. ఒకప్పుడు లాంక్​షైర్‌కు ఆడినప్పుడు తానూ జాతి వివక్షను ఎదుర్కొన్నానని వెల్లడించాడు.

farukh engineer
టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు ఫరూక్‌ ఇంజినీర్‌

"జీవితాంతం నిషేధించాలని నేననడం లేదు. కానీ ఏదో రకంగా కఠిన శిక్ష అనుభవించాల్సిందే. వారి డబ్బుకు కోతపడేలా భారీ జరిమానా విధించడమో, ఒక టెస్టు సిరీసు లేదా కొంత కాలం ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ ఆడకుండా సస్పెండ్‌ చేయాలి. నేను తొలిసారి కౌంటీ క్రికెట్‌ ఆడేందుకు వెళ్లినప్పుడు 'అతడు భారత్‌ నుంచి వచ్చాడా?' అని గుసగుసలు వినిపించాయి. లాంక్​షైర్‌లో చేరినప్పుడు ఒకట్రెండు సార్లు జాతి వివక్ష వ్యాఖ్యలు ఎదుర్కొన్నా. మరీ వ్యక్తిగతమైనవి కావు కానీ కేవలం భారత్‌ నుంచి వచ్చినందుకే అలా అన్నారు. నా యాసను ఎగతాళి చేశారు. నిజానికి నా ఇంగ్లిష్‌ చాలామంది ఆంగ్లేయుల కన్నా మెరుగ్గా ఉంటుంది. త్వరలోనే వారికది అర్థమైంది. నేను వెంటవెంటనే ముఖం మీదే బదులిచ్చేవాడిని. ఇక కీపింగ్‌లోనూ అదరగొట్టాను. దాంతో ఫరూక్‌తో పెట్టుకోవద్దని వారికి తెలిసొచ్చింది"

-ఫరూక్, టీమ్ఇండియా మాజీ క్రికెటర్​

ఇంగ్లాండ్‌ క్రికెటర్‌ జెఫ్రీ బాయ్‌కాట్‌ 'బ్లడీ ఇండియన్స్‌' అనడం పైనా ఫరూక్‌ మాట్లాడాడు. 'ఇది సాధారణం. కేవలం బాయ్‌కాట్‌ ఒక్కడినే లాగాలని అనుకోవడం లేదు. మిగతా ఆంగ్లేయులు పైకి అనకపోయినా అలాంటి ఆలోచనలతోనైనా ఉంటారు. అతనొక్కడే కాదు, ఆస్ట్రేలియన్లు సహా మరి కొంతమంది ఉన్నారు" అని ఫరూక్​ వివరించాడు.

ఐపీఎల్‌(IPL) రాకతో మొత్తం పరిస్థితి మారిపోయిందని ఫరూక్‌ తెలిపాడు. "కొన్నేళ్ల క్రితం వరకు వారు బ్లడీ ఇండియన్స్‌ అన్నారు. ఎప్పుడైతే ఐపీఎల్‌ మొదలైందో.. కేవలం డబ్బు కోసమే మన బూట్లు నాకుతున్నారు. కానీ నాలాంటి వాళ్లకే మొదట్లో వారి అసలు రంగేంటో తెలుసు. ఇప్పుడు హఠాత్తుగా వాళ్ల రాగం మారింది. కొన్ని నెలలు గడిపేందుకు, డబ్బు ఆర్జించేందుకు ఇప్పుడు భారత్‌ వారికి గొప్ప దేశంగా మారింది" అని ఫరూక్​ వెల్లడించాడు.

ఇదీ చూడండి: WTC Final: 'కోహ్లీసేనతో పోటీ కఠినమే'

Last Updated : Jun 9, 2021, 2:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.