ETV Bharat / sports

10 వికెట్లతో రెచ్చిపోయిన కమిన్స్- 32 ఏళ్లలో తొలిసారి- 2023 ఏడాది నీదే గురూ! - కమిన్స్ ఐపీఎల్ ధర

Pat Cummins 10 Wickets Test: ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కెరీర్​లో అద్భుత ఘనత సాధించాడు. అతడు పాకిస్థాన్​పై రెండో టెస్టులో 10 వికెట్లు పడగొట్టి రికార్డులకెక్కాడు.

Pat Cummins 10 Wickets Test
Pat Cummins 10 Wickets Test
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 29, 2023, 5:14 PM IST

Pat Cummins 10 Wickets Test : పాకిస్థాన్​తో జరుగుతున్న టెస్టు సిరీస్​ రెండో మ్యాచ్​లో ఆస్ట్రేలియా 79 పరుగుల తేడాతో నెగ్గింది. ఈ మ్యాచ్​లో ఆస్ట్రేలియా రెండు ఇన్నింగ్స్​ల్లో (318-10&262-10) స్కోర్లు నమోదు చేసింది. ఇక తొలి ఇన్నింగ్స్​లో 264-10 స్కోర్ చేసిన పాకిస్థాన్, 317 పరుగులు లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్​ను ప్రారంభించింది. ఆసీస్ బౌలింగ్​ దెబ్బకు పాక్ రెండో ఇన్నింగ్స్​లో 237 పరుగులకే ఆలౌటై, 79 పరుగుల తేడాతో ఓడింది. దీంతో మూడు మ్యాచ్​ల టెస్టు సిరీస్​ను ఆసీస్ 2-0తో దక్కించుకుంది. ఇరు జట్ల మధ్య మూడో మ్యాచ్ జనవరి 3న ప్రారంభం కానుంది. అయితే ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఈ మ్యాచ్​లో ఓ అరుదైన ఘనత సాధించాడు.

మెల్​బోర్న్ క్రికెట్ గ్రౌండ్స్​ వేదికగా జరిగిన ఈ మ్యాచ్​లో కమిన్స్ రెండు ఇన్నింగ్స్​ల్లో వరుసగా 5/48, 5/49 ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. దీంతో ఈ టెస్టులో మొత్తం కమిన్స్ 10 వికెట్లు దక్కించుకున్నాడు. ఈ క్రమంలో అతడు 1991 తర్వాత ఈ గ్రౌండ్​లో టెస్టు ఓ మ్యాచ్​లో 10 వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్​గా రికార్డుల్లోకెక్కాడు. ఇక తన పదునైన పేస్ బౌలింగ్​తో ప్రత్యర్థి జట్టును శాసించిన కమిన్స్​కే 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు' లభించింది.

కలిసొచ్చిన 2023 : 2023 సంవత్సరం కమిన్స్​కు బాగా కలిసొచ్చింది. ఒక కెప్టెన్​గా అతడు అస్ట్రేలియా జట్టుకు డబ్ల్యూటీసీ 2023, వన్డే వరల్డ్​కప్​లాంటి ఐసీసీ ప్రతిష్ఠాత్మకమైన ట్రోఫీలు అందించిన కెప్టెన్​గా నిలిచాడు. జూన్​లో జరిగిన యాషెస్ టెస్టు సిరీస్​లోనూ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. కానీ యాషెస్ 2-2తో డ్రాగా ముగిసింది. ఇక ఐపీఎల్ 2024 వేలంలోనూ కమిన్స్​ భారీ ధర దక్కించుకున్నాడు. అతడ్ని సన్​రైజర్స్ హైదరాబాద్ ఏకంగా రూ.20.50 కోట్లకు కొనుగోలు చేసింది. 2023 సంవత్సరం కమిన్స్ క్రికెట్ కెరీర్​లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ ఏడాది కమిన్స్​కు ఎంతో ఇచ్చింది. ఒక విధంగా చెప్పాలంటే క్రికెట్​లో 2023 సంవత్సరం కమిన్స్​దే!

ఆల్​టైమ్ రికార్డ్ ప్రైజ్- వరల్డ్​కప్ విన్నింగ్​ కెప్టెన్​ రాకతో SRHలో నయా జోష్

కమిన్స్​ సేన షాకింగ్​ నిర్ణయం.. 11 ఏళ్లలో తొలిసారి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.