Rohit sharma: పంత్‌ను ఓపెనర్‌గా పంపడం ప్రయోగం మాత్రమేనని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. తర్వాత వన్డేకు శిఖర్ ధావన్ అందుబాటులోకి వస్తే, పంత్ ఐదో స్థానంలోనే బ్యాటింగ్ చేస్తాడని రోహిత్ అన్నాడు. బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా 44 పరుగుల తేడాతో గెలిచింది. అనంతరం టీమ్ సభ్యుల్ని ప్రశంసించిన రోహిత్.. వారి ప్రదర్శనపై ఆనందం వ్యక్తం చేశాడు.
"సిరీస్ గెలవడం ఎప్పుడూ ఆనందమే. ఈరోజు మేం కొన్ని కఠిన సవాళ్లు ఎదుర్కొన్నాం. కేఎల్ రాహుల్, సూర్య నెలకొల్పిన భాగస్వామ్యం అద్భుతం. మా జట్టుకు కావాల్సింది అలాంటి ఇన్నింగ్స్‌లే. సూర్య ఆడిన ఇన్నింగ్స్ అతడి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఏదైనా కొత్తగా చేద్దామనే ఉద్దేశంతోనే పంత్‌ను ఓపెనర్‌గా పంపించాం. ఇది శాశ్వతం కాదు. టీమ్ఇండియా బౌలింగ్‌లో ఇంత మంచి స్పెల్ చూడలేదు. ప్రసిద్ధ్ కృష్ణ అద్భుతంగా బౌలింగ్ చేశాడు" అని రోహిత్ శర్మ చెప్పాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా.. 50 ఓవర్లలో 237/9 స్కోరు చేసింది. సూర్యకుమార్ 64, కేఎల్ రాహుల్ 49 పరుగులతో ఆకట్టుకున్నారు. అనంతరం ఛేదనలో విండీస్ 193 పరుగులకే ఆలౌటైంది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 0-2 తేడాతో భారత్ సొంతం చేసుకుంది.
ఇవీ చదవండి: