Rishabh Pant Batting : టీమ్‌ఇండియా జట్టుకు అలాగే అభిమానులకు గుడ్ న్యూస్ అందింది. గతేడాది చివర్లో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యంగ్ బ్యాటర్ అండ్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టేశాడు. ఓ లోకల్ మ్యాచ్‌లో అతడు బ్యాటింగ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఈ వీడియోను చూసి క్రికెట్ అభిమానలు.. ఫుల్ ఖుషీ అవుతున్నారు. అతడు త్వరగా మళ్లీ మాములు స్థితికి చేరుకుని ఫిట్‌నెస్ సాధించాలని, అలాగే మళ్లీ టీమ్‌ఇండియా తరఫున బరిలోకి దిగి బ్యాట్ పట్టుకోవాలని తెగ కామెంట్లు చేస్తూ ఆ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు.
ఇకపోతే రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రిషభ్ పంత్‌కు రెండు మూడు శస్త్రచికిత్సలు జరగడం వల్ల.. దాదాపు మూడు నెలలపాటు బెడ్‌పైనే ఉన్నాడు. అయితే చాలా వేగంగానే కోలుకుంటున్నాడు. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో రిహబిలిటేషన్‌లో చికిత్సను కొనసాగిస్తున్నాడు. అక్కడ ప్రత్యేకంగా స్ట్రెంత్, ఫ్లెక్సిబిలిటి, రన్నింగ్‌లో శిక్షణ తీసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే బెంగళూరులోని జేఎస్‌డబ్ల్యూ విజయ్‌నగర్‌లో జరిగిన ఓ ప్రాక్టీస్ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేశాడు పంత్.
అభిమానుల అరుపులు, కేకలతో.. పంత్ ఆడుతున్నాడని తెలిసి అక్కడికి భారీగా అభిమానులు తరలివచ్చారు. అతడు బ్యాటింగ్‌కు దిగగానే అక్కడి ఫ్యాన్స్ అరుపులు, కేకలు, చప్పట్లతో హోరెత్తించారు. అతడు ఆడిన ప్రతి షాట్‌ను వీడియోల్లో చిత్రీకరించారు. ఓ అభిమాని వీడియోను పోస్ట్ చేస్తూ.. "పంత్ చాలా ఈజీగా కదులుతున్నాడు. ట్రేడ్ మార్క్ షాట్లతో బాగా అలరించాడు. రెండు భారీ షాట్లు కూడా ఆడాడు" అంటూ రాసుకొచ్చాడు. రీసెంట్గా జులై 21 నుంచి పంత్ ఎన్సీఏలో బ్యాటింగ్, కీపింగ్ ప్రాక్టీస్ ప్రారంభించినట్లు బీసీసీఐ తెలిపింది. ఈ క్రమంలోనే పంత్‌కు సంబంధించి ఈ ప్రాక్టీస్ మ్యాచ్ వీడియో బయటకు వచ్చింది. ఇకపోతే పంత్ వచ్చే ఏడాది ఇంగ్లాండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌తో తిరిగి టీమ్‌ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చే అవకాశముందని తెలిసింది. వీలైనంత త్వరగా ఫిట్‌నెస్ సాధిస్తే.. ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కన్నా ముందే టీమ్‌ఇండియాలోకి వచ్చే ఛాన్స్ కూడా ఉందట.
-
Rishabh Pant has resumed batting practice.
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 16, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
An excellent news for Indian cricket! pic.twitter.com/5I2Q6tsaeE
">Rishabh Pant has resumed batting practice.
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 16, 2023
An excellent news for Indian cricket! pic.twitter.com/5I2Q6tsaeERishabh Pant has resumed batting practice.
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 16, 2023
An excellent news for Indian cricket! pic.twitter.com/5I2Q6tsaeE
Rishabh Pant NCA : వేగంగా కోలుకుంటున్న పంత్.. 140 కి.మీ వేగంతో వచ్చే బంతులను కూడా..
వరల్డ్‌కప్ ముందు టీమ్‌ఇండియాకు గుడ్ న్యూస్.. స్టార్ ప్లేయర్ రీఎంట్రీ!