ETV Bharat / sports

కోహ్లీ 'నో బాల్' వివాదం​.. పాక్​ మాజీలు సెటైర్లు - కోహ్లీ నో బాల్​ వివాదం

పాకిస్థాన్​తో జరిగిన మ్యాచ్​లో కోహ్లీ నో బాల్ వివాదంపై పాక్​ మాజీ ప్లేయర్స్ స్పందించారు. కోహ్లీ తప్పు లేదని చెబుతూనే.. టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత కూడా ఇలాంటి నిర్ణయాలు వెలువడటం సరైంది కాదని ఆక్షేపించారు.

Kohli pak former cricketers
కోహ్లీ 'నో బాల్'​.. పాక్​ మాజీలు సెటైర్లు
author img

By

Published : Oct 25, 2022, 6:47 AM IST

టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై భారత్‌ ఘన విజయం సాధించింది. కోహ్లీ అద్భుత ప్రదర్శన చేశాడు. అయితే ఇవేవీ పాకిస్థాన్​కు చెందిన కొందరు మాజీ క్రికెటర్లు మింగున పడట్లేదు. పాక్‌ బౌలర్‌ నవాజ్‌ వేసిన చివరి ఓవర్‌లో 'నో బాల్' నిర్ణయం వివాదానికి దారితీసింది. ఇక్కడ విరాట్ కోహ్లీని ఏమీ అనడానికి లేదు. ఎందుకంటే 'నో బాల్' అప్పీల్‌ చేసుకొనే హక్కు అతడికి ఉంది. దీంతో బాణం అంపైర్‌ ఎరాస్మస్‌ వైపు మళ్లింది. విరాట్ అడగగానే ఎరాస్మస్‌ మరో అంపైర్‌తో చర్చించకుండానే నిర్ణయం తీసుకొన్నాడని పాక్‌ దిగ్గజాలు వసీం అక్రమ్, వకార్‌ యూనిస్‌, షోయబ్‌ మాలిక్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. విరాట్ కోహ్లీ తప్పు లేదని చెబుతూనే.. టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత కూడా ఇలాంటి నిర్ణయాలు వెలువడటం సరైంది కాదని ఆక్షేపించారు.

"బంతిని చూస్తే కిందకు దిగుతున్నట్లుగానే అనిపించింది. బంతి గమనం చెక్‌ చేసే కెమెరాలోనూ నోబాల్‌గా కనిపించలేదు. స్లో మోషన్‌లో కూడా దిగుతుందేమో అనిపించేలా ఉంది. అయితే బ్యాటర్‌కు నో బాల్‌ గురించి అడిగే హక్కుంది. కోహ్లీ పొరపాటు అస్సలు లేదు. అయితే ఇలాంటి పెద్ద మ్యాచుల్లో టెక్నాలజీని వాడుకుంటే బాగుండేది. మనకు మంచి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉంది. అనవసరంగా వివాదాలకు అవకాశం ఇవ్వడం ఎందుకు?" - వసీం అక్రమ్‌

"విరాట్ అడిగే వరకు కాకుండా లెగ్‌ అంపైర్‌ నేరుగా నో బాల్‌ను ప్రకటిస్తే సరిపోయేది. అయితే లెగ్ అంపైర్‌ కచ్చితంగా లైన్‌ అంపైర్‌ (నాన్ స్ట్రైకింగ్‌) దృష్టికి తీసుకెళ్లి థర్డ్ అంపైర్‌కు నివేదిస్తే బాగుండేది. అది నో బాల్ అవునా..? కాదా..? అనేదానిపై నేను మాట్లాడను. ఈ వివాదంలోకి తలదూర్చదలుచుకోలేదు. కానీ ఇలాంటి నిర్ణయం తీసుకొనే ముందు పైస్థాయిలో కూడా సంప్రదించాల్సింది. థర్డ్‌ అంపైర్‌ ఉన్నదే అందుకోసం కదా.. అతడికి వదిలేస్తే బాగుండేది. దానిని నో బాల్‌గా కానీ సిక్స్‌గా కానీ ప్రకటించవచ్చు" - వకార్‌ యూనిస్‌

"ఇలాంటి వివాదస్పద నిర్ణయాల్లో థర్డ్‌ అంపైర్ జోక్యం ఉండాల్సిందే. అవకాశం ఉన్నప్పుడు దానిని వినియోగించుకోవడంలో తప్పులేదు. ఇలాంటి పెద్ద మ్యాచుల్లో కీలక సమయంలో నిర్ణయాలు కచ్చితంగా ఉండాలి. ఎవరైనా పొరపాట్లు చేయడం సహజం. కానీ థర్డ్ అంపైర్‌ను సంప్రదించి ఉంటే బాగుండేది. రీప్లేలో చూసి నిర్ణయం తీసుకొని ఉండే పరిస్థితి వేరేగా ఉండేది. వివాదాస్పదం కాకుండా ఉండేదేమో" - షోయబ్‌ మాలిక్

ఇదీ చూడండి: Kohli - Ravi Shastri : కోహ్లి గురించి రవి శాస్త్రి అన్న మాటలకు అర్థం మీకు తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.