ETV Bharat / sports

టీమ్​ఇండియాను ఓడిస్తే అతడిని పెళ్లి చేసుకుంటా: హీరోయిన్​ - pakisthan actor sehar shinwari

పాకిస్థాన్​ నటి సెహర్​ షిన్వారి టీమ్​ఇండియాపై మరోసారి తన అక్కసును వెళ్లగక్కింది. జింబాబ్వే.. టీమ్​ఇండియాను ఓడిస్తే ఆ దేశపు వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని చెప్పింది.

Pakisthan actor on teamindia
టీమ్​ఇండియాను ఓడిస్తే అతడిని పెళ్లి చేసుకుంటా
author img

By

Published : Nov 3, 2022, 3:56 PM IST

పాకిస్థాన్​ నటి సెహర్‌ షిన్వారీ టీమ్​ఇండియా-జింబాబ్వే మ్యాచ్​పై సంచలన వ్యాఖ్యలు చేసింది. టీ20 వరల్డ్ కప్ 2022లో భాగంగా నవంబర్‌ 6న ఇరు జట్లు తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్‌లో జింబాబ్వే.. భారత్​ను చిత్తుగా ఓడిస్తే ఆమె ఆ దేశపు వ్యక్తిని పెళ్లాడుతానని చెప్పింది. ఈ మేరకు ఆమె ట్వీట్‌ చేసింది. 'తదుపరి మ్యాచ్‌లో జింబాబ్వే అద్భుతంగా భారత్‌ను ఓడించినట్లైతే.. నేను ఆ దేశానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటాను' అని తెలిపింది.

కాగా, గతంలో కూడా ఈ పాకిస్థాన్​ నటి.. భారత్​ జట్టుపై అక్కసు వెళ్లగక్కుతూ వివాదాస్పద ట్వీట్లతో వార్తల్లో నిలిచింది. స్వదేశంలో టీ20 సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా చేతిలో భారత జట్టు నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయినప్పుడు కూడా భారత జట్టుపై విమర్శలు చేసింది. ప్రస్తుతం ఈ నటి చేసిన ట్వీట్లు నెట్టింట్లో విమర్శలకు దారి తీసింది. క్రికెట్‌ ప్రేమికులు, భారత్‌ అభిమానులు ఓ రేంజ్‌లో విరుచుకుపడుతున్నారు.

ఇదీ చూడండి: 'బౌలర్స్​ బీ కేర్​ఫుల్​.. దాని గురించి సూర్యకు బాగా తెలుసు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.