Pakistan odi world cup 2023 : ఈ ఏడాది చివర్లో భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్‌లో దాయాది దేశం పాకిస్థాన్ పాల్గొంటుందా..? లేదా..? అన్నదానిపై ఇంతకాలం అనిశ్చితి కొనసాగిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా దీనిపై ఓ క్లారిటీ వచ్చేసింది. పాక్ జట్టు టీమ్ఇండియాలో పర్యటించేలా అక్కడి ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చింది. ఈ విషయాన్ని పాక్ ఫారెన్ మినిస్ట్రీ తెలిపింది. స్పోర్ట్స్‌ను పాలిటిక్స్ కోణంలో చూడట్లేదని వెల్లడించింది. అందుకే పాక్ జట్టును ఇండియాకు పంపుతున్నట్లు పేర్కొంది.
ODI world cup 2023 pak vs ind : అయితే తమ జట్టు భద్రతా దృష్ట్యా భారత్ పర్యటనకు పంపే విషయమై పాకిస్థాన్‌కు తీవ్ర ఆందోళనలు ఉన్నాయని, వాటిని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్, భారత అధికారులతో చర్చిస్తామని తెలియజేసింది. "భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాల పరిస్థితి.. అంతర్జాతీయ క్రీడలకు, ఇతర అంశాలకు అడ్డంకిగా ఉండకూడదని పాకిస్థాన్ భావిస్తోంది. భారత పర్యటనలో పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు పూర్తి భద్రత కల్పించాలని కోరుకుంటున్నాం" అని పాక్ ఫారెన్ మినిస్ట్రీ ఓ ప్రకటనను విడుదల చేసింది. తాము తీసుకున్న ఈ నిర్ణయం నిర్మాణాత్మక, బాధ్యతాయుతమైన విధానాన్ని సూచిస్తోందని తెలిపింది.
ODI world cup 2023 schedule : కాగా, ఇకపోతే గత ఎడిషన్లతో పోలిస్తే ఇప్పటికే ఈ ఏడాది వన్డే ప్రపంచకప్ చాలా ఆలస్యంగా నిర్వహిస్తున్నారు. లేదంటే సాధారణంగా జూన్, జూలై మధ్య ఈ వన్డే వరల్డ్ కప్ జరిగేది. ఈ సారి భారత్ వేదికగా ఈ ఏడాది అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు వన్డే ప్రపంచకప్ 2023 జరగనుంది. ఇప్పటికే మ్యాచ్‌లకు సంబంధించి బీసీసీఐ, ఐసీసీలు తుది షెడ్యూల్‌ను కూడా అనౌన్స్ చేశాయి. అయితే మ్యాచ్‌లను నిర్వహించాల్సిన వేదికలు, తేదీల విషయంలో కొంత గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌లకు సంబంధించి పాకిస్థాన్ జట్టు కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేసింది. అలాగే భద్రతా పరంగా ఆందోళనల నేపథ్యంలో కొన్ని వేదికలను మార్చాలని ఐసీసీని అభ్యర్థించింది. వీటిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
ICC World Cup 2023 : భారత్- పాక్ మ్యాచ్ హైప్ పీక్స్.. ఆస్పత్రులనూ వదలట్లేదుగా!
'జైషా సారూ.. భారత్- పాక్ మ్యాచ్ డేట్ మార్చేశారు.. మా 'కాస్ట్లీ రూమ్'ల పరిస్థితేంటి!?'