స్పాట్ ఫిక్సింగ్ ఉదంతంలో నిందితుడిగా పదేళ్లు శిక్ష అనుభవించాడు పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సల్మాన్ బట్. 2010లో ఈ శిక్ష ప్రారంభంకాగా గతేడాదితో ముగిసింది. దీంతో ఇతడు అంపైరింగ్ కోర్సుకు దరఖాస్తు చేసుకున్నాడు.
సల్మాన్‌తో పాటు అబ్దుల్ రౌఫ్, బిలాల్ ఆసిఫ్, షోయబ్ ఖాన్ కూడా ఈ కోర్సులో చేరారు. ఇందులో మూడు లెవల్స్ ఉంటాయి. మొదటి లెవల్లో అంపైర్ నిబంధనలపై ఆన్లైన్ క్లాస్‌లు ఇవ్వాల్సి ఉంటుంది.
కోహ్లీ కంటే రోహిత్ బెటర్ కెప్టెన్
ఇటీవలే టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో న్యూజిలాండ్‌పై ఓడింది టీమ్ఇండియా. దీంతో ఇప్పటివరకు వరుసగా ఐసీసీ టోర్నీల్లో విఫలమవుతోన్న కోహ్లీపై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే స్పందించిన సల్మాన్ బట్.. కోహ్లీ కంటే రోహిత్ ఉత్తమ సారథి అని చెప్పాడు.
"ఐదేళ్లుగా టీమ్ఇండియా అగ్రజట్టుగా కొనసాగుతోంది. కానీ ఒక్క మేజర్ టోర్నీలోనూ విజేతగా నిలవలేదు. అందువల్ల ఎవ్వరైనా కెప్టెన్సీని ప్రశ్నిస్తారు. ఎవరైనా మంచి కెప్టెన్ అనిపించుకోవచ్చు. కానీ మేజర్ టైటిల్స్ గెలవలేకపోతే అతడిని ఎవ్వరూ గుర్తుంచుకోరు" అని వెల్లడించాడు సల్మాన్.
ఈ క్రమంలోనే.. 2018లో ఆసియా కప్ సమయంలో హిట్‌మ్యాన్ కెప్టెన్సీని తాను గమనించినట్లు వెల్లడించాడు సల్మాన్. అతడిలో కెప్టెన్సీ లక్షణాలు ఎక్కువగా ఉన్నట్లు తెలిపాడు.