Pakistan Cricketer Hasan Ali On IPL : అంతర్జాతీయ స్థాయిలో టీ20 క్రికెట్‌కు గ్లామర్ తీసుకొచ్చింది ఇండియన్ ప్రీమియర్ లీగ్- ఐపీఎల్. అభిమానులకు వినోదాన్ని అందిస్తూ.. ప్లేయర్లకూ ఆర్థిక దన్నుగా నిలుస్తోంది. ఈ ప్రతిష్టాత్మక టీ20 టోర్నీలో ఆడేందుకు ప్రపంచ వ్యాప్తంగా ప్లేయర్లు ఆసక్తి చూపిస్తారు. ఐపీఎల్ వేలంలో తమను ఏ జట్టు అయినా కొనుగోలు చేయాలని కోరుకుంటారు. అందుకేనేమో ఐపీఎల్‌పై మనసు పారేసుకున్నాడు పాకిస్థాన్‌కు చెందిన ప్లేయర్ హసన్ అలీ. తనకు అవకాశమొస్తే ఈ టోర్నీలో ఆడతానని తెలిపాడు.
"ప్రపంచంలో ప్రతి క్రికెటర్ ఐపీఎల్‌లో ఆడాలని కోరుకుంటాడు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద టీ20 క్రికెట్ లీగ్. నాకు కూడా ఐపీఎల్‌లో ఆడాలని ఉంది. ఒకవేళ ఫ్యూచర్లో అవకాశం వస్తే ఐపీఎల్‌లో కచ్చితంగా ఆడతా"
--హసన్ అలీ, పాకిస్థాన్ క్రికెట్ ప్లేయర్
-
Hasan Ali said "Every player wants to play IPL & it is my wish to play there. It is one of the biggest leagues in the world and I will definitely play there if there is an opportunity in the future". [Samaa Lounge] pic.twitter.com/pKRjSDh9kh
— Johns. (@CricCrazyJohns) November 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Hasan Ali said "Every player wants to play IPL & it is my wish to play there. It is one of the biggest leagues in the world and I will definitely play there if there is an opportunity in the future". [Samaa Lounge] pic.twitter.com/pKRjSDh9kh
— Johns. (@CricCrazyJohns) November 27, 2023Hasan Ali said "Every player wants to play IPL & it is my wish to play there. It is one of the biggest leagues in the world and I will definitely play there if there is an opportunity in the future". [Samaa Lounge] pic.twitter.com/pKRjSDh9kh
— Johns. (@CricCrazyJohns) November 27, 2023
ఐపీఎల్‌కు పాక్ ప్లేయర్లు దూరం- కారణమిదే!
పాకిస్థాన్ ప్లేయర్లు ఐపీఎల్‌లో ఆడకపోవడానికి కారణం ఉంది. 2008లో జరిగి ఐపీఎల్ ప్రారంభ ఎడిషన్‌లో పాకిస్థాన్ క్రికెటర్లు షోయబ్ మాలిక్, షోయబ్ అక్తర్, కమ్రాన్ అక్మల్, సోహైల్ తన్వీర్, షాహిద్ అఫ్రిది పాల్గొన్నారు. కానీ 2009లో ముంబయిలో జరిగిన ఉగ్రదాడుల కారణంగా ఆ దేశ ఆటగాళ్లకు ఐపీఎల్‌లో ఎంట్రీపై నిషేధం విధించారు. అయితే ఆ తర్వాత పాక్ క్రికెటర్ అజహర్ మహ్మద్ బ్రిటీష్ పౌరసత్వం తీసుకుని ఐపీఎల్ ఆడాడు. రాబోయే ఐపీఎల్‌లో ఇటీవలే బ్రిటీష్ పౌరసత్వం పొందిన పాకిస్థాన్ మాజీ బౌలర్ మహ్మద్ అమీర్ కూడా ఐపీఎల్‌లో ఆడే ఆవకాశం ఉంది.
IPL Auction 2024 Date : మరోవైపు, వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్‌కు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా డిసెంబర్ 19న మినీ వేలం నిర్వహించనున్నారు. ఈ వేలంలో పాల్గొనాడానికి 590 మంది ఆటగాళ్లు తమ పేర్లు నమోదు చేసుకున్నారని సమాచారం. ఇటీవల ముగిసిన వరల్డ్ కప్ ఫైనల్లో అద్భుత ప్రదర్శన చేసిన ఆసీస్ స్టార్ ట్రావిస్ హెడ్, న్యూజిలాండ్ జట్టు సంచలన ప్లేయర్ రచిన్ రవీంద్ర, దక్షితాఫ్రికా పేసర్ కోట్జీ వంటి ప్లేయర్లు ఈసారి వేలంలో అధిక ధర పలికే అవకాశం ఉందని అభిమానులు అనుకుంటున్నారు.
శుభ్‌మన్‌కు ప్రమోషన్ - గుజరాత్ కొత్త కెప్టెన్‌గా గిల్
'అలా బ్యాటింగ్ చేయడం సరదా - నా రోల్ ఏంటో నాకు తెలుసు'- ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్న రింకూ, ఇషాన్