ETV Bharat / sports

పాకిస్థాన్​కు భారీ షాక్​.. బంతి తగిలి స్టార్ బ్యాటర్​ తలకు గాయం

టీ20 ప్రపంచకప్​లో తమ జట్టు ఆడబోయే తొలి మ్యాచ్​కు పాకిస్థాన్​కు భారీ షాక్ తగిలింది. నెట్స్​లో ప్రాక్టీస్​ చేస్తుండగా స్టార్ బ్యాటర్​ మసూద్​ తలకు గాయమైంది. ప్రస్తుతం అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు.

Pakistan batter Masood hit on head at nets
పాకిస్థాన్​కు భారీ షాక్​.. బంతి తగిలి స్టార్ బ్యాటర్​ తలకు గాయం
author img

By

Published : Oct 21, 2022, 5:31 PM IST

టీ20 ప్రపంచకప్ 2022లో భాగంగా అక్టోబర్ 23న భారత్-పాకిస్థాన్​ మధ్య మ్యాజ్​ జరగనుంది. అయితే ఈ మ్యాచ్​కు ముందు పాక్​కు భారీ షాక్ తగిలింది. ఇప్పటికే ఆ జట్టుకు గాయల బెడద వేధిస్తోంది. అయితే తాజాగా ఆ జట్టుకు చెందిన మరో ప్లేయర్​కు గాయమైంది. స్టార్ బ్యాటర్ షాన్ మసూద్ తలకు గాయమైంది. నెట్ ప్రాక్టీస్​లో భాగంగా నవాజ్ కొట్టిన బలమైన షాట్​కు బంతి నేరుగా వెళ్లి మసూద్ వెనుక భాగంలో తగిలింది. దీంతో మసూద్ అక్కడిక్కడే కుప్పుకూలిపోయాడు. కొద్ది సేపు కదలకుండా అలానే ఉండిపోయాడని తెలిసింది. ఆ తర్వాత నొప్పితో విలవిలలాడాడట. దీంతో అతడికి తక్షణమే ప్రాథమిక చికిత్స అందజేశారు. ఇక కాసేపటికి మసూద్​ తేరుకున్నాక అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు.

ప్రస్తుతం అతడి తలకి స్కానింగ్ చేసినట్లు సమాచారం. రిపోర్టులు ఆధారంగా అతడు టీ20 ప్రపంచకప్​లో ఆడతాదా లేదా అని తెలుస్తుంది. అయితే బంతి మసూద్ తలకు తగిలిన వెంటనే.. ఆ షాట్ ఆడిన నవాజ్ ఉన్న చోటే మోకాళ్లపై కూర్చోని చాలా బాధపడ్డాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్​మీడియాలో వైరల్​ అవుతోంది. ఇది చూసిన అభిమానులు ఆందోళనకు గురౌతున్నారు. మసూద్​కు ఏం కాకూడదని ప్రార్థిస్తున్నారు.

  • Shan Masood leaves with ice pack on his face, Nawaz hit a shot & the ball struck Masood. Shan was to play in place of Fakhar Zaman against India. This could be a problem for Pakistan #SportsYaari pic.twitter.com/XK0m180OKL

    — Sushant Mehta (@SushantNMehta) October 21, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

కాగా, క్రికెట్​లో బంతి తగలడం మాములు విషయం కాదు. చాలా పెద్ద ప్రమాదం లాంటిది. గతంలో 2014లో ఆస్ట్రేలియా బ్యాటర్ ఫిలిఫ్ హ్యూజ్... బంతి తలకు తగలడంతో మరణించిన సంగతి తెలిసిందే. ఇకపోతే అక్టోబర్ 23న జరిగే మ్యాచ్ కోసం భారత్, పాక్ జట్లు ఇప్పటికే మెల్​బోర్న్​ చేరుకున్నాయి. ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే మసూద్ గాయపడ్డాడు.

ఇదీ చూడండి: T20 World Cup ప్లేయర్​ ఆఫ్​ ది టోర్న్​మెంట్​ అవార్డు అందుకున్న వారెవరంటే​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.