ETV Bharat / sports

క్రికెట్‌ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు.. సూర్యను మించిపోయాడుగా! - పాకిస్థాన్​ అఫ్గానిస్థాన్​లేటెస్ట్​

అంతర్జాతీయ టీ20ల్లో పాకిస్థాన్​ క్రికెటర్‌ అబ్దుల్లా షఫీఖ్​ అత్యంత చెత్త రికార్డు నమోదు చేశాడు. వరుసగా నాలుగు టీ20 మ్యాచ్‌ల్లో డకౌటైన తొలి ఆటగాడిగా నిలిచాడు.

Etv pakistan-batter-abdullah-shafique worst-record-of-ducks-in-t20i-cricket
pakistan-batter-abdullah-shafique worst-record-of-ducks-in-t20i-cricket
author img

By

Published : Mar 27, 2023, 1:48 PM IST

పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ అబ్దుల్లా షఫీఖ్ టీ20ల్లో చెత్త రికార్డు నమోదు చేశాడు. వరుసగా 4 మ్యాచ్‌ల్లో డకౌటైన తొలి బ్యాటర్‌గా చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అఫ్గానిస్థాన్‌తో ఆదివారం జరిగిన రెండో టీ20లో గోల్డెన్ డకౌట్ అయిన అబ్దుల్లా షఫీఖ్.. ఈ వరస్ట్ ఫీట్ తన పేరిట లిఖించుకున్నాడు. ఫజలక్ ఫరూఖీ వేసిన తొలి ఓవర్ మూడో బంతికే అబ్దుల్లా వికెట్ల ముందు దొరికిపోయాడు.

అఫ్గానిస్థాన్‌తో జరిగిన తొలి టీ20లోనూ డకౌటైన అబ్దుల్లా షఫీఖ్.. అంతకుముందు న్యూజిలాండ్‌తో రెండు టీ20ల్లో వరుసగా రెండు బంతులు మాత్రమే ఆడి డకౌటయ్యాడు. దాంతో వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో డకౌటైన తొలి ప్లేయర్‌గా చెత్త రికార్డు నమోదు చేశాడు.

అయితే రెండో టీ20 మ్యాచ్‌లోనూ పాకిస్థాన్ 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్ల‌లో 6 వికెట్లకు 130 పరుగులు మాత్రమే చేసింది. ఇమాద్ వసీమ్ (64 నాటౌట్) మినహా మిగతా వారంతా విఫలమయ్యారు. అఫ్గాన్ బౌలర్లలో ఫజలక్ ఫరూఖీ రెండు వికెట్లు తీయగా.. నవీన్ ఉల్ హక్, రషీద్ ఖాన్, కరీమ్ జనత్ తలో వికెట్ తీశారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన అఫ్గానిస్థాన్ 19.5 ఓవర్లలో 3 వికెట్లకు 133 పరుగులు చేసి గెలుపొందింది. ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్(49 బంతుల్లో 44), ఇబ్రహీం జడ్రాన్(40 బంతుల్లో 38) రాణించగా.. నజిబుల్లా జడ్రాన్(12 బంతుల్లో 23 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. మహమ్మద్ నబీ సైతం(9 బంతుల్లో సిక్స్‌తో 14 నాటౌట్) విలువైన పరుగులు చేశాడు.

ఇక మూడు టీ20ల సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచిన అఫ్గానిస్థాన్ 2-0తో మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌కు రెగ్యులర్ కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్‌తో పాటు మహమ్మద్ రిజ్వాన్, షాహిన్ షా అఫ్రిది, హరీస్ రౌఫ్ వంటి సీనియర్ ఆటగాళ్లు దూరంగా ఉన్నారు. పసికూన అని అఫ్గాన్‌ను పాక్ లైట్ తీసుకోగా.. ఘోర పరాజయం ఎదురైంది. కాగా, ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో టీమ్​ఇండియా స్టార్‌ ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌ వరుసగా మూడు మ్యాచ్‌ల్లో గోల్డన్‌ డక్‌గా వెనుదిరిగాడు. మొదటి రెండు మ్యాచుల్లో ఒకే బౌలర్​ చేతిలో డకౌట్​ అయ్యాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.