శ్రీలంకతో జరగనున్న టీ20 సరీస్‌కు ముందు టీమ్ఇండియాకు భారీ షాక్ తగిలేలా కనిపిస్తోంది. పాస్ట్బౌలర్ దీపక్ చాహర్ గాయం కారణంగా ఆ సిరీస్‌కు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. వెస్డిండీస్‌తో ఆదివారం జరిగిన ఆఖరి టీ20లో చాహర్ మోకాలి గాయంతో బాధపడ్డాడు. దీంతో 1.5 ఓవర్లు బౌలింగ్ చేసి, మైదానం నుంచి బయటకొచ్చేశాడు. ఈ మ్యాచ్‌లో కీలక వికెట్లు పడగొట్టి జట్టుకు శుభారంభాన్ని అందించాడు. అయితే అతడు గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి ఆరు వారాలు పట్టేలా ఉంది.
చెన్నైకి ఎదురుదెబ్బ!
ఒకవేళ ఇదే జరిగితే చాహర్ ఐపీఎల్లో కూడా ప్రారంభ మ్యాచ్‌లకు దూరం కావాల్సి వస్తుంది. ఇటీవల జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో చాహర్‌ను చెన్నై సూపర్ కింగ్స్ రూ.14 కోట్ల భారీ మొత్తాన్ని వెచ్చించి, తిరిగి సొంతం చేసుకుంది. చాహర్ గాయం.. చెన్నై జట్టు ప్రణాళికలపై స్వల్ప ప్రభావం చూపొచ్చు.
లఖ్‌నవూ వేదికగా ఫిబ్రవరి 24న భారత్-శ్రీలంక మధ్య తొలి టీ20 జరగనుంది. భారత పర్యటనలో భాగంగా శ్రీలంక మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనుంది.
ఇదీ చూడండి: రోహిత్.. తొలి కెప్టెన్‌గా సరికొత్త రికార్డు!