ETV Bharat / sports

'సూపర్ ఫామ్​లో ఇషాన్.. ఇక పంత్ పని అంతే!'.. స్టెయిన్ హెచ్చరిక

ఇషాన్‌ కిషన్ ఫామ్‌లోకి రావడం టీమ్‌ ఇండియాలోని కొందరి స్థానాలకు ఇబ్బందిగా మారే అవకాశం ఉందని దక్షిణాఫ్రికా మాజీ పేసర్ డేల్‌ స్టెయిన్‌ అభిప్రాయపడ్డాడు.

ishan kishan form
ishan kishan form
author img

By

Published : Oct 12, 2022, 10:55 PM IST

టీమ్‌ ఇండియా యువ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌పై దక్షిణాఫ్రికా దిగ్గజం డేల్‌ స్టెయిన్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. అతని విషయంలో ఇతర యువ ఆటగాళ్లు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్‌లో ఇషాన్‌ కిషన్‌ కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. దీంతో ఫామ్‌లోకి వచ్చిన ఇషాన్‌ వల్ల టీమ్‌ ఇండియా యువ ఆటగాళ్ల స్థానాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని స్టెయిన్‌ అభిప్రాయపడ్డాడు.

సఫారీల సిరీస్‌లో తొలి వన్డేలో నిదానంగా ఆడి.. సోషల్‌ మీడియాలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఇషాన్‌.. రెండో మ్యాచ్‌లో తన దూకుడు ఏంటో చూపించాడు. భారీ షాట్లతో పాత ఇషాన్‌ కిషన్‌ను చూపించాడని... సౌతాఫ్రికా పేసర్‌ ఆన్రిచ్‌ నోకియా బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్స్‌లు బాదడం తనను బాగా ఆకట్టుకుందని స్టెయిన్‌ చెప్పుకొచ్చాడు.

"ఇషాన్‌తో నేను ఐపీఎల్​లో ఆడాను. అప్పుడు చాలా చిన్నవాడు. మేమంతా జస్టిన్‌ బీబర్‌ అని పిలిచేవాళ్లం. ఇషాన్‌ రోజురోజుకూ వృద్ధి చెందడం చూస్తూనే ఉన్నా. కాస్త పొట్టిగా ఉండే ఇషాన్‌.. అద్భుతమైన షాట్లు కొట్టగలడు. నోకియా బౌలింగ్‌లో మంచి టైమింగ్‌తో.. తన మజిల్‌ పవర్‌ను ఉపయోగించి సిక్స్‌లు బాదాడు. ఇషాన్‌ స్థాయిలోనే ఉన్న రిషభ్‌ పంత్‌, ఇతర ఆటగాళ్లు అతని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే వారి సీటుకే ఎసరు తేగలడు"
- డేల్ స్టెయిన్‌

ఇక ఈ ఏడాది ఐపీఎల్ మెగా వేలంలో ఇషాన్ కిషన్​కు అత్యధిక ధర పలికింది. అయితే ఈ సీజన్‌ మొత్తం ఫామ్‌ లేమితో ఇబ్బందిపడ్డాడు. ఎట్టకేలకు దక్షిణాఫ్రికాతో వన్డేలో పరుగులు సాధించి గాడినపడ్డట్లు కనిపిస్తున్నాడు.

ఇవీ చదవండి : వన్డే ర్యాంకింగ్స్​లో శ్రేయస్ దూకుడు​, ధావన్ డీలా.. టాప్​ 5లో ఎవరున్నారంటే?

'విరాట్ కోహ్లీ లాంటోళ్లు ఎందరో.. అలా చేస్తేనే మానసిక ఒత్తిడిని జయించొచ్చు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.