ETV Bharat / sports

రోహిత్‌ భాయ్‌తో నాకున్న బంధం ప్రత్యేకమైనది: చాహల్​ - యుజువేంద్ర చాహల్​

రోహిత్​శర్మతో(rohit sharma and yuzi chahal) తనకున్న బంధం క్రికెట్‌కు మించినది అని అన్నాడు టీమ్​ఇండియా లెగ్​ స్పిన్నర్​ యుజువేంద్ర చాహల్​. అందుకే మైదానంలో తన వ్యూహాలను స్వేచ్ఛగా పంచుకోగలుగుతానని చెప్పాడు.

rohith sharma
రోహిత్​శర్మ
author img

By

Published : Nov 16, 2021, 10:29 AM IST

న్యూజిలాండ్‌ జట్టుతో ప్రారంభం కానున్న టీ20 సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్న రోహిత్ శర్మతో(rohit sharma chahal) తనకున్న బంధం ప్రత్యేకమైనదని టీమ్​ఇండియా లెగ్ స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ అన్నాడు. అందుకే మైదానంలో తన వ్యూహాలను స్వేచ్ఛగా పంచుకోగలుగుతానని పేర్కొన్నాడు.

"రోహిత్ భాయ్‌తో నా బంధం ప్రత్యేకమైనది(rohit sharma and yuzi chahal). రితిక (రోహిత్ భార్య) నన్ను తమ్ముడిలా చూసుకుంటుంది. మేమంతా ఓ కుటుంబంలా కలిసి మెలిసి ఉంటాం. అందరం కలిసి అప్పుడప్పుడూ డిన్నర్‌కు వెళ్తుంటాం. మా ఇద్దరి మధ్య బంధం క్రికెట్‌కు మించినది. అందుకే మైదానంలో ఆడుతున్నప్పుడు కూడా నా వ్యూహాలను రోహిత్‌తో స్వేచ్ఛగా పంచుకోగలుతాను" అని చాహల్ అన్నాడు.

అయితే, ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌నకు(yuzvendra chahal t20 world cup) ఎంపిక కాకపోవడం కొంచెం నిరాశకు గురి చేసిందని చాహల్ చెప్పాడు. "చాలా ఏళ్లుగా టీమ్​ఇండియాకు ఆడుతున్నా.. టీ20 ప్రపంచకప్‌కు ఎంపిక కాకపోవడం కాస్త నిరాశ కలిగించింది. ఐపీఎల్‌లో మెరుగైన ప్రదర్శన చేసినా.. భారత జట్టు తరఫున పొట్టి ఫార్మాట్లో చోటు దక్కకపోవడం వల్ల షాక్‌కు గురయ్యాను. రెండు, మూడు రోజులు ఆ షాక్‌ నుంచి తేరుకోలేకపోయాను. ఆ సమయంలో నా కోచ్‌ల దగ్గరికి వెళ్లి మాట్లాడాను. నా భార్య, కుటుంబం కూడా చాలా అండగా నిలిచింది. నా అభిమానులు కూడా నన్ను ప్రోత్సహిస్తూ పోస్టులు పెట్టేవారు. ఆ సమయంలో అవే కొంచెం ఊరటనిచ్చాయి" అని చాహల్ చెప్పాడు.

ఇదీ చూడండి: హార్దిక్​కు షాక్​.. ఎయిర్​పోర్టులో అడ్డుకున్న కస్టమ్స్​ అధికారులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.