జట్టులోని బౌలర్ల మధ్య నమ్మకం, స్నేహభావం, అర్థంచేసుకునే గుణం ఉండటమే టీమ్ఇండియా పేస్ దళం విజయానికి కారణమని చెప్పాడు ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ.
"మా ఫాస్ట్ బౌలింగ్ దళంలో ప్రతిఒక్కరిదీ కష్టపడేతత్వం. ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. ఒకరి సంతోషాన్ని, విజయాన్ని మరొకరు ఆస్వాదిస్తారు. మాలో ఎవరైనా ఆత్మవిశ్వాసం కోల్పోతే మేమందరం కలిసి అతడిలో మళ్లీ ఆ విశ్వాసాన్ని పెంచుతాము. అతడిలోని ఒత్తిడిని పోగొట్టి మాములు స్థితికి తీసుకొస్తాం. ప్లేయర్ల మధ్య బంధాలు అలానే ఉండాలి. ఎందుకంటే దేశం తరఫున ప్రాతినిధ్యం వహించడం గర్వకారణం."
-మహ్మద్ షమీ, టీమ్ఇండియా ఫాస్ట్ బౌలర్.
షమీ, ఇషాంత్ శర్మ, బుమ్రా, భువనేశ్వర్ కుమార్, ఉమేశ్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, టి.నటరాజన్ వంటి ఆటగాళ్లతో బౌలింగ్ దళం బలంగా ఉంది.
త్వరలోనే టీమ్ఇండియా రెండు జట్లుగా విడిపోయి ఇంగ్లాండ్, శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ జూన్ 18-22 వరకు, ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ ఆగస్టు4-సెప్టెంబరు 14 వరకు జరగనుంది. శ్రీలంక సిరీస్ జులైలో జరగనుంది.