ETV Bharat / sports

14 ఏళ్లుగా చెక్కుచెదరని సచిన్​ రికార్డు - 15వేల మార్క్​కు 14 ఏళ్లు

దిగ్గజ క్రికెటర్​ సచిన్​ తెందుల్కర్​ వన్డేల్లో 15వేల మార్కును అందుకుని నేటికి 14 ఏళ్లవుతోంది. అయినా ఇప్పటికీ ఆ రికార్డును అధిగమించే అవకాశాలు లేవు. 2007లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్​లో తెందుల్కర్ ఈ ఫీట్​ను సాధించాడు.

sachin tendulkar, former team india batsmen
సచిన్ తెందుల్కర్, టీమ్ఇండియా మాజీ క్రికెటర్
author img

By

Published : Jun 29, 2021, 8:30 PM IST

భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ అంటేనే రికార్డులకు మారుపేరు.​ వన్డేల్లో అతడు 15వేల మార్క్​ను అందుకుని నేటికి 14 ఏళ్లు అవుతోంది. క్రికెట్​ చరిత్రలో ఈ ఘనత అందుకున్న ఏకైక బ్యాట్స్​మన్​​ లిటిల్ మాస్టర్​ కాగా.. ఇంతవరకు ఈ రికార్డు చెక్కుచెదరకుండా ఉంది. దీనిని ఇప్పట్లో అధిగమించే క్రికెటర్​ దరిదాపుల్లో కూడా లేడు.

మూడు వన్డేల సిరీస్​లో భాగంగా 2007లో దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో సచిన్ ఈ ఫీట్ సాధించాడు. 227 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన టీమ్ఇండియాకు.. సచిన్ అద్భుత అర్ధ సెంచరీతో విజయానికి బాటలు వేశాడు. 106 బంతుల్లో 93 రన్స్​ చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలోనే 15వేల మార్క్​ను అందుకున్నాడు తెందుల్కర్. ఈ మ్యాచ్​లో భారత్​ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

1989 నవంబర్​ 15న టెస్ట్ ఫార్మాట్​తో క్రికెట్​ కెరీర్​ను ప్రారంభించిన సచిన్​.. అదే ఏడాది డిసెంబర్​ 18న వన్డేల్లో చోటు సంపాదించాడు. సుదీర్ఘ ఫార్మాట్​లో 51 సెంచరీల సాయంతో 15,921 పరుగులు చేశాడు మాస్టర్​ బ్లాస్టర్​. శతకాల సంఖ్యలోనూ సచిన్​ రికార్డు అలాగే ఉంది. ఇక వన్డేల్లో 49 సెంచరీలతో 18,426 రన్స్​ చేశాడు లిటిల్ మాస్టర్​. మొత్తం 24 ఏళ్ల తన క్రికెట్ జీవితంలో మొత్తం ఆరు ప్రపంచకప్​లలో టీమ్ఇండియాకు ప్రాతినిధ్యం వహించాడు. 2011 ప్రపంచకప్​ గెలిచిన జట్టులో తెందుల్కర్​ సభ్యుడు.

కోహ్లీకి సాధ్యమేనా?

వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన వారి జాబితాలో సచిన్ తెందుల్కర్​ 18,426 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. తర్వాతి స్థానంలో కుమార సంగక్కర 14వేల పైచిలుకు పరుగులతో ఉన్నాడు. క్రికెట్​కు రిటైర్మెంట్​ ప్రకటించిన సంగక్కర.. తెందుల్కర్​ రికార్డును అధిగమించే అవకాశం లేదు. ప్రస్తుతం ఆడుతున్న క్రికెటర్లలో ఒక్క విరాట్ కోహ్లీ మాత్రమే సచిన్​ దరిదాపుల్లో చేరే అవకాశం ఉంది. ప్రస్తుతం అతడు 12,169 పరుగులతో అత్యధిక పరుగుల జాబితాలో ఆరో స్థానంలో ఉన్నాడు.

గత ఏడాదిన్నర కాలంగా ఫామ్​లేమితో ఇబ్బంది పడుతున్న కోహ్లీ.. ఒక్కసారి గాడిలో పడితే సచిన్​ 15వేల మార్కును అందుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం విరాట్ వయసు 32 ఏళ్లు. ఇంకో ఐదేళ్ల పాటు క్రికెట్​లో కొనసాగే సత్తా అతడికుంది. ఈ నేపథ్యంలో సచిన్​ సరసన చేరే అవకాశముంది.

ఇదీ చదవండి: 'ఆమె' కోసం సౌథీ డబ్ల్యూటీసీ జెర్సీ వేలం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.