ETV Bharat / sports

ఫామ్​లో లేని కోహ్లీ- పడిపోతున్న బ్యాటింగ్​ సగటు - ఫామ్​లేమితో కోహ్లీ సతమతం

"విరాట్​ కోహ్లీ.. బౌండరీలు​ కొట్టినంత సులభంగా శతకాలు సాధించేవాడు. ఛేజింగ్​లోకి దిగాడంటే జట్టును విజయతీరాలకు చేర్చడం ఖాయం," ఇవన్నీ ఒకప్పుడు! ప్రస్తుతం కోహ్లీ.. పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్నాడు. మూడెంకల స్కోరు అందుకుని దాదాపు 18 నెలలు అవుతుండటం ఇందుకు నిదర్శనం. పేలవ బ్యాటింగ్​ వల్ల కోహ్లీ సగటు కూడా పడిపోతోంది.

virat kohli, team india captain
విరాట్ కోహ్లీ, టీమ్ఇండియా కెప్టెన్
author img

By

Published : Jun 25, 2021, 9:31 PM IST

టీమ్‌ఇండియా రన్​మెషిన్, సారథి విరాట్‌ కోహ్లీ(Virat Kohli).. తన కెరీర్​లోనే ఎన్నడూ లేనంతగా ఇబ్బంది పడుతున్నాడు. ఏడాదికి కనీసం నాలుగైదు సెంచరీలు సాధించే కోహ్లీ ఖాతాలో.. గత 18 నెలలుగా ఒక్క సెంచరీ కూడా లేకపోవడం ఇందుకు నిదర్శనం. అంతేకాకుండా.. అతడి బ్యాటింగ్​ సగటు కూడా పడిపోతుండటం అభిమానులను కలవరపెడుతోంది.

టెస్టులు, వన్డేల్లో కలిపి ఇప్పటికే 70 శతకాలు సాధించిన కోహ్లీ.. ఇటీవల జరిగిన ప్రపంచ టెస్ట్​ ఛాంపియన్​షిఫ్​ ఫైనల్​లోనూ (WTC final) డీలాపడ్డాడు. త్వరలో ఇంగ్లాండ్‌తో జరగనున్న సిరీస్​లోనైనా 71వ శతకం అందుకోవాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

పడిపోయిన బ్యాటింగ్ సగటు..

గత ఏడాదిన్నర కాలంగా బ్యాటింగ్​లో గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాడు విరాట్ కోహ్లీ. 2019 నవంబర్​లో బంగ్లాదేశ్​పై చివరిసారిగా సెంచరీ సాధించాడు. ఆ తర్వాత కొద్దిసార్లు మాత్రమే 70, అంతకుమించిన పరుగులు సాధించాడు.

2008లో క్రికెట్​లోకి అడుగుపెట్టిన తర్వాత ప్రతి ఏడాది శతకం సాధిస్తూ వచ్చాడు టీమ్​ఇండియా సారథి. 2020లో మాత్రమే అతడు మూడెంకల స్కోరు అందుకోలేకపోయాడు.

ఇప్పటివరకు టెస్టుల్లో 52.04 సగటుతో బ్యాటింగ్​ కొనసాగిస్తూ వచ్చాడు కోహ్లీ. 2019లో చివరగా సెంచరీ కొట్టిన తర్వాత 8 టెస్టులు ఆడాడు. వీటిలో 14 ఇన్నింగ్స్​ల్లో బ్యాటింగ్ చేసిన విరాట్​.. 24.64 సగటును నమోదు చేశాడు. వీటిల్లో రెండు అర్ధ సెంచరీలు మాత్రమే ఉన్నాయి. స్వదేశంలో చెన్నై వేదికగా ఇంగ్లాండ్​పై ఒకటి.. మరొకటి ఆసీస్​తో అడిలైడ్​ టెస్ట్​లో చేశాడు. ​

2019 తర్వాత వన్డేల్లో 15 మ్యాచు​లాడిన విరాట్​.. 43.26 సగటుతో 649 రన్స్​ చేశాడు. 50 ఓవర్ల ఫార్మాట్​లో కోహ్లీ సగటు 59.07గా ఉంది. టెస్టులతో పోలిస్తే వన్డేల్లో ఫర్వాలేదనిపించాడు. ఇందులో 8 హాఫ్​ సెంచరీలు నమోదు చేశాడు. కానీ, మూడెంకల స్కోరును అందుకోలేకపోయాడు.

అయితే ఇదే సమయంలో టీ20 ఫార్మాట్​లో మునుపటి కంటే మెరుగ్గా కనిపించాడు విరాట్. 64.45 సగటుతో 709 పరుగులు చేశాడు. పొట్టి ఫార్మాట్​లో అతని కెరీర్ సగటు 52.65గా ఉంది.

ఇదీ చదవండి: డబ్ల్యూటీసీ రెండో ఎడిషన్​ షురూ- భారత్​ షెడ్యూల్ ఇదే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.