ODI WorldCup 2023 AFG VS ENG : వన్డే వరల్డ్ కప్ 2023లో సంచలనం నమోదైంది. నేడు(అక్టోబర్ 15) జరిగిన మ్యాచ్‌లో అప్గానిస్థాన్ జట్టు ఘన విజయం సాధించింది. జగజ్జేత ఇంగ్లాండ్‌కు పసికూన అప్గాన్ షాకిచ్చింది. 69 పరుగులు తేడాతో ఓడించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ 49.5 ఓవర్లలో 284 పరుగులకు ఆలౌట్ కాగా.. అనంతరం 285 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన ఇంగ్లాండ్ 40.3 ఓవర్లలో 215 పరుగులకే కుప్పకూలింది. అఫ్గాన్ బౌలర్లు బెంబేలెత్తించారు.
ఇంగ్లాండ్‌లో హ్యారీ బ్రూక్ 66 టాప్ స్కోర్. ఆ తర్వాత డేవిడ్ మలాన్(32) ఒక్కడే పర్వాలేదనిపించాడు. మిగతా వారు అంతా విఫలమవ్వగా.. చివర్లో వచ్చిన అదిల్ రషీద్(20), మార్క్ వుడ్(18), రిస్ టోప్లీ(15) స్కోరు బోర్డు కాస్త ముందుకు తీసుకెళ్లారు. అప్గాన్ బౌలర్లలో ముజీబ్ ఉర్ రెహ్మాన్ (10-1-51-3) ఇంగ్లాండ్ లైనప్‌ను గట్టిగా దెబ్బకొట్టాడు. ఆ తర్వాత మొహమ్మద్ నబీ (6-0-16-2), రషీద్ ఖాన్ (9.3-1-37-3), నవీన్ ఉల్ హాక్ (6-1-44-1), ఫజల్ హక్ ఫారూఖీ (7-0-50-1) కూడా వరుసగా వికెట్లు తీసి ఇంగ్లాండ్‌ను చతికిల పడేలా చేశారు.
ఇకపోతే తొలుత బ్యాటింగ్ చేసిన అప్గాన్ జట్టులో ఓపెనర్ రెహ్మనుల్లా గుర్భాజ్ (80; 57 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపులు మెరిపించాడు. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ ఇక్రమ్ (58; 66 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్) హాఫ్ సెంచరీ బాదాడు. చివర్లో ముజిబుర్ రెహ్మన్ (28; 16 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ 3, మార్క్ వుడ్ 2, లివింగ్ స్టోన్, జోరూట్, టాప్లీ ఒక్కో వికెట్ తీశారు.
వరల్డ్‌కప్‌లో రెండో విజయం.. 2015 ఎడిషన్‌తో వన్డే ప్రపంచకప్‌లోకి అరంగేట్రం చేసింది అప్గానిస్థాన్. ఆ టోర్నీలో 6 మ్యాచ్‌లు ఆడి కేవలం ఒక్కటే విజయం సాధించింది. అది కూడా స్కాట్లాండ్‌పై. వరల్డ్ కప్‌లో అప్గానిస్థాన్కు ఇదే మొదటి, ఆఖరి విజయం. ఆ తర్వాత 2019 ఎడిషన్‌లో 9 మ్యాచ్‌లు ఆడినా ఒక్క మ్యాచ్‌లోనూ విజయం దక్కించుకోలేకపోయింది. ప్రస్తుత వరల్డ్ కప్‌లోనూ తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమిని అందుకున్న అప్గానిస్థాన్.. ఇప్పుడు ఇంగ్లాండ్‌పై చారిత్రక విజయాన్ని అందుకుని.. ప్రపంచకప్‌లో తమ రెండో విజయాన్ని నమోదు చేసింది.
-
Afghanistan scripted history with a stunning upset win over defending champions England in Delhi in a thrilling #CWC23 clash 🙌#ENGvAFG | 📝: https://t.co/bg3maGwrG6 pic.twitter.com/YJ2Qd4dDN8
— ICC (@ICC) October 15, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Afghanistan scripted history with a stunning upset win over defending champions England in Delhi in a thrilling #CWC23 clash 🙌#ENGvAFG | 📝: https://t.co/bg3maGwrG6 pic.twitter.com/YJ2Qd4dDN8
— ICC (@ICC) October 15, 2023Afghanistan scripted history with a stunning upset win over defending champions England in Delhi in a thrilling #CWC23 clash 🙌#ENGvAFG | 📝: https://t.co/bg3maGwrG6 pic.twitter.com/YJ2Qd4dDN8
— ICC (@ICC) October 15, 2023
ODI World Cup 2023 Srilanka VS Australia : ఈ ఆటగాళ్లపైనే ఆశలు.. జట్టుకు అండగా నిలబడతారా?
World Cup 2023 Records : ప్రపంచకప్‌లో రికార్డుల మోత.. రికార్డుల రారాజు కెప్టెన్ హిట్‌మ్యానే!