Odi World Cup 2023 Team India Problems : కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్‌ల ఫిట్‌నెస్, ఫామ్‌పై సందేహాలతో వరల్డ్ కప్‌కు సెలెక్ట్ చేయాలో వద్దో తెలియదు.. ఒకవేల వీళ్లు అందుబాటులో లేకపోయే ఎవరిని తీసుకోవాలో తెలీదు. ఫినిషర్‌గా పనికొస్తాడనుకున్న సూర్య కుమార్ వన్డేల్లో ఇబ్బంది పడుతున్నాడు. బుమ్రా ఫిట్‌నెప్‌పై కూడా సందిగ్ధం. ఒకవేళ బుమ్రా అందుబాటులోకి వచ్చినా..టీమ్‌లో మూడో పేసర్‌గా ఎవరిని తీసుకోవాలో క్లారిటీ లేదు. ఇదంతా ఒక నెల కిందట టీమ్ ఇండియాకు ఉన్న సమస్యలు. సొంత గడ్డపై జరిగే వరల్డ్ కప్‌లో గెలుస్తుందని ఆశలు పెట్టుకుంటే.. సమస్యలతో సతమతమైంది. కానీ ఇప్పుడలా లేదు. ఈ నెల రోజుల్లో ఒక్కొక్కటిగా సమస్యలన్నీ పరిష్కారం అయ్యాయి. టీమ్‌లో ఆత్మ విశ్వాసాన్ని పెంచింది.
Jasprit Bumrah World Cup 2023 : భరోసానిచ్చిన బుమ్రా.. రెండేళ్ల కింద ప్రపంచంలోనే బెస్ట్ పేస్ దళంగా పేరు తెచ్చుకుంది భారత ఫాస్ట్ బౌలింగ్ విభాగం. కానీ ప్రధాన పేసర్ బుమ్రా గాయంతో టీమ్‌కు దూరం కావడం వల్ల పేస్ విభాగం బలహీన పడింది. గతేడాది టీ 20 వరల్డ్ కప్‌నకు భరోసానిచ్చే బౌలర్లు లేరు. దీంతో చాలా కాలంగా టీ20 టీమ్‌లో లేని షమి, భువనేశ్వర్‌లను నమ్ముకోవాల్సి వచ్చింది. అయితే సుదీర్ఘ కాలం అందుబాటులో లేని బుమ్రా.. ఈ ఏడాది వన్డే ప్రపంచకప్ ముందు.. అనగా గత నెలలో ఫిట్‌నెస్ అందుకుని ఐర్లాండ్ టూర్‌కు కెప్టెన్‌గా వెళ్లి.. జట్టుకు కొండంత భరోసానిచ్చాడు.
ఆసియాకప్‌లోనూ నిలకడగా బౌలింగ్ చేశాడు బుమ్రా. అతడి భాగస్వామ్యంతో సిరాజ్ కూడా బెస్ట్ పెర్ఫార్మెన్స్ చేశాడు. ఆసియా కప్ తుదిపోరులో సిరాజ్ రెచ్చిపోయి ఆడాడు. అయితే వీరిద్దరి తోడుగా మూడో పేసర్ ఎవరిని దించాలా అన్న సమయంలో కొన్ని మ్యాచ్‌ల్లో శార్దూల్ ఠాకూర్‌ను ఆడిస్తే నిరాశపరిచాడు. ఆ మధ్యలోనే షమికి ఛాన్స్ వచ్చినా వినియోగించుకోలేకపోయాడు. దీంతో ఆసియా కప్‌లో మూడో పేసర్ ప్రశ్నకు జవాబు దొరకలేదు. కానీ ఆస్ట్రేలియాతో రీసెంట్గా ప్రారంభమైన వన్డే సిరీస్‌లో ఆన్సర్ దొరికేసింది. షమి రెచ్చిపోయి ఆడుతున్నాడు. కాబట్టి అతడే మూడో పేసర్‌గా ఖరారు. దీంతో భారత పేస్ విభాగం మళ్లీ పటిష్టంగా తయారైపోయింది.
-
Bumrah arrived at the airport 🔥🔥#bumrah pic.twitter.com/i5d8E8HBnM
— Viral Bhayani (@viralbhayani77) September 26, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Bumrah arrived at the airport 🔥🔥#bumrah pic.twitter.com/i5d8E8HBnM
— Viral Bhayani (@viralbhayani77) September 26, 2023Bumrah arrived at the airport 🔥🔥#bumrah pic.twitter.com/i5d8E8HBnM
— Viral Bhayani (@viralbhayani77) September 26, 2023
బ్యాటింగ్‌లోనూ.. బ్యాటింగ్‌లో కూడా ఉన్న సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం అయిపోయాయి. గాయపడిన కేఎల్ రాహుల్(kl rahul play world cup 2023).. ఆసియా కప్‌లో సూపర్-4 నుంచి అందుబాటులోకి రావడంతో పాటు మంచి ప్రదర్శన చేశాడు. కీలకమైన పాకిస్థాన్ మ్యాచ్‌లో అజేయ శతకంతో అదరగొట్టాడు. ఆస్ట్రేలియాతో తొలి రెండు వన్డేల్లోనూ హాఫ్ సెంచరీలు బాదాడు. ఈ రెండు మ్యాచుల్లో కెప్టెన్‌గానూ ఆకట్టుకున్నాడు. వికెట్ కీపింగ్ కూడా చేస్తూ ఫిట్‌నెస్ పరంగా తాను బాగానే ఉన్నట్లు నిరూపించాడు.
రాహుల్ లాగే గాయం వల్ల సుదీర్ఘ కాలం టీమ్‌కు దూరమైన శ్రేయస్(shreyas iyer world cup 2023) కూడా ఇప్పుడు గాడిన పడ్డాడు. ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో అనవసరంగా రనౌటైనపప్పటికీ.. రెండో వన్డేలో అద్భుత శతకాన్ని నమోదు చేసి తనపై వచ్చిన డౌట్స్‌కు చెక్ పెట్టాడు.
మరోవైపు ఇదే మ్యాచ్‌లో సూర్యకుమార్ కూడా అద్భుత ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. టీ20 మెరుపులు వన్డేల్లో కొనసాగించలేకపోతున్నాడని విమర్శలు ఎదుర్కొన్న సూర్యకుమార్(suryakumar yadav world cup 2023).. ఇందౌర్ వేదికగా జరిగిన రెండో వన్డేలో తన సత్తా చాటాడు. తొలి వన్డేలోనూ అతను హాఫ్ సెంచరీ సాధించి ప్రపంచకప్‌లో ఫినిషర్ పాత్రకు తనే కరెక్ట్ ఛాయిస్ అంటూ చెప్పకనే చెప్పాడు. దీంతో ఇలా బ్యాటింగ్ పరంగా ఉన్న సందేహాలు కూడా తీరిపోయాయి.
-
Wicket No.2 for @ashwinravi99 🙌🙌
— BCCI (@BCCI) September 24, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
A carrom ball to dismiss Warner.
Live - https://t.co/OeTiga5wzy… #INDvAUS @IDFCFIRSTBank pic.twitter.com/yIRjjTejKJ
">Wicket No.2 for @ashwinravi99 🙌🙌
— BCCI (@BCCI) September 24, 2023
A carrom ball to dismiss Warner.
Live - https://t.co/OeTiga5wzy… #INDvAUS @IDFCFIRSTBank pic.twitter.com/yIRjjTejKJWicket No.2 for @ashwinravi99 🙌🙌
— BCCI (@BCCI) September 24, 2023
A carrom ball to dismiss Warner.
Live - https://t.co/OeTiga5wzy… #INDvAUS @IDFCFIRSTBank pic.twitter.com/yIRjjTejKJ
Ravichandran Ashwin World Cup 2023 : అశ్విన్ అనుకోకుండా.. ఆసీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో సీనియర్ స్పిన్నర్ అశ్విన్ కూడా మంచిగా ఆడటం.. టీమ్ఇండియాకు కలిసొచ్చే అంశం. అసలు కొన్ని రోజుల క్రితం.. వరల్డ్ కప్ కోసం అనుకున్న టీమ్ అశ్విన్ పేరే ఊసులోకి రాలేదు. పైగా ఏడాదిన్నార కాలంలో అశ్విన్ వన్డేలు కూడా ఆడలేదు. కానీ ఆసియా కప్‌లో అక్షర్ పటేల్ గాయపడడంతో అనూహ్యంగా అశ్విన్ ఎంట్రీ ఇచ్చాడు. ఆస్ట్రేలియాపై జరిగిన రెండు వన్డేల్లోనూ మంచిగా రాణించాడు. దీంతో వరల్డ్ కప్‌నకు అతడిని సెలెక్ట్ చేయాలన్న డిమాండ్ పెరిగిపోయింది.
ప్రస్తుతానికైతే శార్దూల్ ఠాకూర్ ఒక్కడే జట్టుకు కొంచెం భారం అన్న వాదనలు వినిపిస్తున్నాయి. అతడు మంచి ప్రదర్శన చేయలేకపోతున్నాడు. కాబట్టి అతడికి బదులుగా ఆసీస్‌పై రెండో వన్డేలో మంచిగా ఆడిన ప్రసిద్ధ్ కృష్ణను సెలెక్ట్ చేసే మంచిదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
BCCI Team India : ఒకే దెబ్బకు రెండు పిట్టలు.. ఆ మాస్టర్ ప్లాన్‌తో టీమ్ఇండియా ఓ మెట్టు పైకి