ETV Bharat / sports

ODI World Cup 2023 : డూ ఆర్‌ డై మ్యాచ్‌.. పాపం బాబర్‌ అజామ్.. ఇలా జరిగిందేంటి? - మార్కో జానెసన్ మహమ్మద్ రిజ్వాన్ వివాదం

ODI World Cup 2023 PAK VS South Africa : వన్డే ప్రపంచకప్‌ - 2023లో భాగంగా పాకిస్థాన్​ - దక్షిణాఫ్రికా మధ్య కీలక మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్​లో బాబర్​ అజామ్​కు అస్సలు ఊహించని విధంగా జరిగింది. అలానే ఈ మ్యాచ్​లో ఓ చిన్నపాటి వివాదం కూడా చోటు చేసుకుంది.

ODI World Cup 2023 : డూ ఆర్‌ డై మ్యాచ్‌.. పాపం బాబర్‌ అజామ్.. ఇలా జరిగిందేంటి?

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 27, 2023, 6:42 PM IST

ODI World Cup 2023 PAK VS South Africa : వన్డే ప్రపంచకప్‌ - 2023లో భాగంగా జరుగుతున్న కీలక మ్యాచ్‌లో పాకిస్థాన్​ - దక్షిణాఫ్రికా జట్లు తలపడుతున్నాయి. అయితే ఈ మ్యాచ్​లో టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ ఎంచుకున్న పాకిస్థాన్‌ 46.4 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ (50), సౌద్‌ షకీల్‌ (52) హాఫ్ సెంచరీలతో అద్భుతంగా రాణించారు. షాదాబ్‌ ఖాన్‌ (43) ఫర్వాలేదనిపించాడు. సఫారీ బౌలర్లలో తబ్రైజ్‌ షంసీ 4 వికెట్లు, మార్కో జాన్సన్‌ 3 వికెట్లు, గెరాల్డ్‌ కొయిట్జీ 2, లుంగి ఎంగిడి ఒక వికెట్‌ దక్కించుకున్నారు.

బాబర్ ఇలా ఔట్ అయ్యాడంటి?.. ఈ మ్యాచ్​తో మరో హాఫ్‌ సెంచరీను తన ఖాతాలో వేసుకున్నాడు పాకిస్థాన్​ కెప్టెన్‌ బాబర్‌ ఆజం. 65 బంతులను ఎదుర్కొన్న అతడు.. 4 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 50 పరుగులు చేశాడు. అయితే దురదృష్టకర రీతిలో ఔటయ్యాడు. పాకిస్థాన్​ ఇన్నింగ్స్‌ 28 ఓవర్‌ వేసిన స్పిన్నర్‌ షంసీ బౌలింగ్‌లో ఐదో బంతిని బాబర్‌ ల్యాప్‌ స్వీప్‌ షాట్‌ ఆడాడు. కానీ ఆ షాట్‌ బాదడంతో అతడు ఫెయిల్ అయ్యాడు. బంతి లెగ్‌ స్టంప్‌ను మిస్​ అవుతూ వికెట్‌ కీపర్‌ డికాక్‌ చేతికి వెళ్లిపోయింది. అలానే బంతి బ్యాట్‌కు దగ్గరగా కూడా వెళ్లున్నట్లు కనిపించింది. దీంతో డికాక్‌ క్యాచ్‌కు అప్పీల్‌ చేయగా.. అంపైర్‌ మాత్రం నాటౌట్‌ ఇచ్చాడు. అయితే దక్షిణాఫ్రికా కెప్టెన్‌ టెంబా బావుమా ఆఖరి సెకెండ్‌లో రివ్యూ తీసుకోగా.. రిప్లేలో బాబర్‌ చేతి గ్లావ్‌కు బంతి తాకినట్లు స్పష్టమైంది. దీంతో ఫీల్డ్‌ అంపైర్‌ తన నిర్ణయాన్ని మార్చుకుని ఔట్‌గా అనౌన్స్ చేశాడు. బాబర్‌ నిరాశతో పెవిలియన్‌కు చేరాడు.

చిన్న పాటి వివాదం.. అయితే ఈ మ్యాచ్​లో పాక్‌ స్టార్‌ బ్యాటర్‌ మహమ్మద్ రిజ్వాన్, ప్రోటీస్ స్పీడ్‌ స్టార్‌ మార్కో జానెసన్‌ మధ్య చిన్నపాటి మాటల యుద్ధం జరిగింది. ఇమామ్‌ ఉల్‌-హాక్‌ ఔటైన తర్వాత మహ్మద్‌ రిజ్వాన్‌ క్రీజులోకి వచ్చాడు. అప్పుడు జానెసన్‌ బౌలింగ్‌లో తాను ఎదుర్కొన్న తొలి బాల్​కే ఔటయ్యే ప్రమాదం నుంచి రిజ్వాన్‌ తప్పించుకున్నాడు. రిటర్న్‌ క్యాచ్‌ను అందుకోవడంలో జానెసన్‌ ఫెయిల్ అయ్యాడు. ఆ తర్వాతి బంతిని రిజ్వాన్‌ బౌండరీగా దిశగా బాదగా.. అతడి దగ్గరికి వెళ్లి జానెసన్​ ఏదో అన్నాడు. రిజ్వాన్‌ కూడా నీ పని చూసుకో అన్నట్లు కొన్ని సైగలు చేశాడు. అప్పుడు బాబర్‌ ఆజం, ఫీల్డ్‌ అంపైర్‌ జోక్యం చేసుకోవడం వల్ల గొడవ సద్దుమణిగింది.

Special Security To Babar Azam : పాక్ కెప్టెన్​ బాబర్​కు బంగాల్​లో స్పెషల్​ సెక్యురిటీ.. ఎందుకో తెలుసా?

ODI World Cup 2023 : ఈ సౌతాఫ్రికా జట్టు హీరో అదరగొడుతున్నాడు.. వరల్డ్​ కప్​ కల నెరవేరుస్తాడా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.