ETV Bharat / sports

ODI World Cup 2023 PAK VS AFG : బాబర్ అజామ్ హాఫ్ సెంచరీ.. ఇఫ్తికర్-షెఫీక్ మెరుపులు.. అప్గాన్ ముందు భారీ లక్ష్యం - బాబర్ ఆజమ్ హాఫ్ సెంచరీ అప్గానిస్థాన్​

ODI World Cup 2023 PAK VS AFG : వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా చెన్నై వేదికగా జరుగుతున్న మ్యాచ్​లో పాకిస్థాన్​ - ఆప్గానిస్థాన్​తో తలపడుతున్నాయి. ఈ పోరులో పాకిస్థాన్ ఇన్నింగ్స్​ ముగిసింది. అప్గానిస్థాన్ టార్గెట్​ ఎంతంటే?

ODI World Cup 2023 PAK VS AFG : బాబర్ ఆజమ్ హాఫ్ సెంచరీ.. ఇఫ్తికర్, షెఫీక్ మెరుపులు.. అప్గాన్ ముందు భారీ లక్ష్యం

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 23, 2023, 5:57 PM IST

Updated : Oct 23, 2023, 6:14 PM IST

ODI World Cup 2023 PAK VS AFG : వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా చెన్నై వేదికగా జరుగుతున్న మ్యాచ్​లో పాకిస్థాన్​ - ఆప్గానిస్థాన్​తో తలపడుతున్నాయి. ఈ పోరులో పాకిస్థాన్ ఇన్నింగ్స్​ ముగిసింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్​ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 282 పరుగుల భారీ స్కోరు చేసింది.

Worldcup 2023 Babar Azam : ఇకపోతే ఈ మ్యాచ్‌ పాకిస్థాన్ జట్టుకు ఎంతో కీలకం. సెమీస్ అవకాశాలు సంక్లిష్టం అవ్వకుండా ఉండాలంటే ఈ మ్యాచ్‌లో ఆ జట్టు తప్పకుండా గెలవాల్సిందే. ఈ పోరులో కెప్టెన్ బాబర్ అజామ్ ( 92 బంతుల్లో 74; 4x4, 1x6), ఓపెనర్ అబ్దుల్లా షఫీక్‌ ( 75 బంతుల్లో 58; 4x4, 2x6) మంచిగా ఆడారు. సాద్ షకీల్ (25), ఇమామ్ ఉల్ హక్ (17), మహ్మద్ రిజ్వాన్ (8) తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. చివర్లో షాదాబ్‌ ఖాన్‌ (38 బంతుల్లో 40; 1x4, 1x6) నిలకడగా రాణించారు. ఇఫ్తికార్ అహ్మద్‌ (27 బంతుల్లో 40; 2x4, 4x6) మెరుపులు మెరిపించాడు. అఫ్గాన్ బౌలర్లలో నూర్ అహ్మద్‌ 3 వికెట్లు పడగొట్టగా.. నవీనుల్ హక్ 2 వికెట్లు తీశాడు. అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌, మహ్మద్‌ నబీ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.

కాగా, ఇమామ్‌ను నవీనుల్‌ హక్‌ పెవిలియన్‌కు పంపాడు. షఫీక్‌, మహ్మద్ రిజ్వాన్​లను(8) నూర్ అహ్మద్ తన వరస ఓవర్లలో ఔట్ చేసి పాక్‌ను దెబ్బతీశాడు. ఈ క్రమంలోనే క్రీజులోకి వచ్చిన షకీల్‌తో కలిసి బాబర్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. అయితే నాలుగో వికెట్‌కు 43 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన ఈ జోడీని నబీ విడదీశాడు. షకీల్.. నబీ బౌలింగ్‌లో రషీద్‌ఖాన్‌కు చిక్కగా.. ఆ తర్వాత కొద్దిసేపటికి బాబర్‌ను అజామ్‌ను నూర్ అహ్మద్‌ పెవిలియన్​కు పంపాడు. చివర్లో షాదాబ్‌ఖాన్‌ సహకారం ఇవ్వడం, ఇఫ్తికార్ అహ్మద్ దూకుడుగా ఆడటం వల్ల పాక్ భారీ స్కోరు చేసింది.

Virat Kohli Centuries : జస్ట్​ మిస్​.. కోహ్లీ సెంచరీలు చేజార్చుకున్న సందర్భాలు ఎన్నో తెలుసా?

Last Updated : Oct 23, 2023, 6:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.